25 December, 2012

శ్రీ పద్మావతి అమ్మవారి కరుణా విశేషము




శ్రీపద్మావతి అమ్మవారి ఆలయములో దద్ద్యోజనము ప్రసాదము స్వీకరించి, ఆఫీసు చేరువలో నేను శ్రీ వేంకటేశ్వర సహస్రనామావాళి పారాయణము, నా ధర్మపత్ని శ్రీలక్ష్మీసహస్రనామ పారాయణము చేసుకొనుచుండగా, అన్నపరమాణ్ణము ప్రసాదముగా పంచుతున్నప్పుడు, నా ధర్మపత్ని "వెళ్ళి అన్నపరమాణ్ణము తీసుకుందాం" అన్నది. అయితే, నా పారాయణము సంగంలో ఉన్నందున "తరువాత తీసుకుందాం" అన్నాను. ఆవిడ "సరే"నని కూర్చుంది. నా పారాయణ ముగించుకుని ప్రసాదము తీసుకుందామనుకునే సరికి ప్రసాదము కౌంటర్ మూసేసి వెళ్ళిపోయారు. మేము నిరుత్సాహముతో "శ్రీనివాసము" తిరిగి వచ్చాము. శ్రీనివాసము లిఫ్టు దగ్గర ఓ ముత్తైదువ వచ్చి "తిరుచానూరు ప్రసాదము" అని మా ఇద్దరికి అదే ప్రసాదము ఇవ్వటం శ్రీపద్మావతి అమ్మవారి కటాక్షముగా భావిస్తున్నాము.  

కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.

కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.


నవంబర్ ఇరవై ఆరున కార్తీక సోమవారము అయింది. శ్రీకాళీహస్తీశ్వర ,జ్ఞానప్రసూనంబల దర్శనార్ధము మేము శ్రీకాళహస్తి ఉదయము ఎనిమిది గంటలకు చేరుకున్నాము. భక్తజనసందోహముతో, శ్రీకాళహస్తి కిటకిటలాడ...ుతోంది. శ్రీస్వామివారిని పవిత్ర కార్తీక సోమవారమునాడు దర్శించుకొనుటకు, భక్తులు బారులుతీర్చి నిల్చున్నారు. పాతాళ గణేశుని దర్శించుటకొరకే దాదాపు ఓ వెయ్యిమంది భక్తులు "క్యూ"లో ఉన్నారు. ఆ గణేశుని బయటనుండే ప్రార్ధించుకుని, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొనుటకు "క్యూ" లో నిల్చుని, ఓ రెండుగంటల అనంతరము ప్రధాన ఆలయప్రాంగణములో ప్రవేశించాము. ఆ తరువాత శ్రీశ్రీకాళహస్తీశ్వరుని దర్శనము అనూహ్యముగా ఓ అరగంటలో సంతృప్తిగా జరిగినది.

ఆ ఆలయములో ఉత్సవమూర్తులకు అర్చన గావించుకుని, "సౌవర్ణాంబరదారిణి" అయిన శ్రీజ్ఞానప్రసూనాంబ అమ్మవారిని సేవించుకున్నాము. పిదప శ్రీదక్షిణామూర్తి స్వామివారి చెంత ధర్మపత్ని సమయాభావమువలన "ఆనందలహరి" మాత్రమే పారాయణ చేసుకున్నది. ఆలయ ప్రాంగణములో వివిధదేవతామూర్తులకు వందనములిడి, మొదటిసారిగా సువర్ణముఖి నదిలో జలకళ చూసి పవిత్ర నదీజలాలను శిరస్సున ప్రోక్షణ గావించుకుని, శ్రీసూర్యనారాయణమూర్తికి అర్ఘ్యములిడి, సంతృప్తితో తిరిగి శ్రీనివాసము చేరుకుని సామాను తీసుకుని ఉదయం రిజర్వుచేసుకున్న మన ఆర్టీసీ బస్సులో రాత్రి ఎనిమిది గంటలకు చిదంబరం వైపుగా తరలివెళ్ళాము.

Photo: కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.
నవంబర్ ఇరవై ఆరున కార్తీక సోమవారము అయింది. శ్రీకాళీహస్తీశ్వర ,జ్ఞానప్రసూనంబల దర్శనార్ధము మేము శ్రీకాళహస్తి ఉదయము ఎనిమిది గంటలకు చేరుకున్నాము. భక్తజనసందోహముతో, శ్రీకాళహస్తి కిటకిటలాడుతోంది. శ్రీస్వామివారిని పవిత్ర కార్తీక సోమవారమునాడు దర్శించుకొనుటకు, భక్తులు బారులుతీర్చి నిల్చున్నారు. పాతాళ గణేశుని దర్శించుటకొరకే దాదాపు ఓ వెయ్యిమంది భక్తులు "క్యూ"లో ఉన్నారు. ఆ గణేశుని బయటనుండే ప్రార్ధించుకుని, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొనుటకు "క్యూ" లో నిల్చుని, ఓ రెండుగంటల అనంతరము ప్రధాన ఆలయప్రాంగణములో ప్రవేశించాము. ఆ తరువాత శ్రీశ్రీకాళహస్తీశ్వరుని దర్శనము అనూహ్యముగా ఓ అరగంటలో సంతృప్తిగా జరిగినది. 
ఆ ఆలయములో ఉత్సవమూర్తులకు అర్చన గావించుకుని, "సౌవర్ణాంబరదారిణి" అయిన  శ్రీజ్ఞానప్రసూనాంబ అమ్మవారిని  సేవించుకున్నాము. పిదప శ్రీదక్షిణామూర్తి స్వామివారి చెంత ధర్మపత్ని సమయాభావమువలన "ఆనందలహరి" మాత్రమే పారాయణ చేసుకున్నది.  ఆలయ ప్రాంగణములో వివిధదేవతామూర్తులకు వందనములిడి, మొదటిసారిగా సువర్ణముఖి నదిలో జలకళ చూసి పవిత్ర నదీజలాలను శిరస్సున ప్రోక్షణ గావించుకుని, శ్రీసూర్యనారాయణమూర్తికి అర్ఘ్యములిడి, సంతృప్తితో తిరిగి శ్రీనివాసము చేరుకుని సామాను తీసుకుని ఉదయం రిజర్వుచేసుకున్న మన ఆర్టీసీ బస్సులో రాత్రి ఎనిమిది గంటలకు  చిదంబరం వైపుగా తరలివెళ్ళాము.

22 December, 2012



మా నలభైయ్యవ వివాహ వార్షికోత్సవము తిరుమలలో శ్రీవారి ముంగిట గడిపాము.


Photo: మా నలభైయ్యవ వివాహ వార్షికోత్సవము తిరుమలలో శ్రీవారి ముంగిట గడిపాము.

శ్రీమాన్ అనంతాళ్వారు వారు తిరుమలలో స్వయముగా నిర్మించిన తటాకము

శ్రీమాన్ అనంతాళ్వారు వారు శ్రీరామానుజాచార్యులువారి అనుజ్ఞమేరకు శ్రీవారి జలకైంకర్యముకొరకు (అభిషేకము ఇత్యాదులకొరకు) తిరుమలలో ఒక తటాకము స్వయముగా నిర్మించారు. ఆ తటాకము మీరు దర్శించండి. చిన్న వీడియో లంకె మీకోసం.

http://www.divshare.com/download/21226339-ff2

తిరుమల శ్రీవారి దర్శనభాగ్య విశేషములు

తిరుమల శ్రీవారి దర్శనభాగ్య విశేషములు


తిరుమల-తిరుపతి దేవస్థానమువారి దశవర్ష స్కీములో భాగంగా పదవసారి మేము నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై అయిదు వరకు తిరుమలలో ఉన్నాము. నవంబర్ ఇరవైరెండున మా నలభైయ్యవ వివాహ వార్షికోత్సవము సందర్భమున మా చిరంజీవులు శ్ర...ీవారి వసంతోత్సవమునకు టిక్కెట్లు తీసుకున్నారు.

వైభవమంటపములో వసంతోత్సవ దర్శనము అపూర్వ అనుభవము .వైభవమంటపములో వసంతోత్సవ అనంతరము ఆరోజు గురువారము అగుటచేత శ్రీవారి నేత్రదర్శనము శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గరగా లభించినది.

Photo: తిరుమల, చిదంబరం, కుంభకోణం, తంజావూరు, కుంభకోణం, జంబుకేశ్వరం, పుణ్యక్షేత్రాల సందర్సన  వివరాలు మెషిన్లో నింపడము పూర్తయినది.


నవంబర్ ఇరవై మూడు దశవర్ష స్కీములో మొదటి రోజు దశమి సుప్రభాత దర్శనములో శుక్రవారము అగుటచేత తిరిగి నేత్రదర్శన (శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి) భాగ్యము కలిగినది. దశవర్షస్కీములో భాగంగా తిరిగి వైకుంఠముద్వారా అదేరోజు మరో దర్శనము ఉండుటచేత, మళ్ళీ వైకుంఠముద్వారా వచ్చుటకు కష్టమగునని అక్కడేఉన్న ఆలయములోనున్న సూపరెండెంటువారిని, ఇక్కడనుండే శ్రీవారిని దర్శించుటకు అనుమతించమని అభ్యర్ధించాము. వారు మా స్కీములో చివరి (పదవ) సంవత్సరము అగుటచేత మా వయస్సు దృష్ట్యా వారు ఆలయద్వజస్థంభమువద్దనుండే మమ్ములను శ్రీవారి దర్శనమునకు అనుమతించినారు. అది మాపాలిటి మరియొక వరమే అయి, భగవంతుని నిజపాదదర్శనము శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గర లభించినది.



ఆ స్కీము రెండవరోజున మరియొకసారి శ్రీవారి సుప్రభాతము సేవలో ఇరవైనాలుగువ తారీఖున పాల్గొని, శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గర ఒక దర్శనము, మరల శీఘ్రదర్శనములో మరియొకసారి లఘుదర్శనములో శ్రీవారిని తిరిగి సేవించుకుని, శ్రీవారి శేషవస్రము, ఆడువారికిచ్చు రవికల గుడ్డ , ఇరవై లడ్డు ప్రసాదములు తీసుకుని "రామ్ బగీచా" లోని మా బసకు చేరుకొన్నాము.

ఆఖరి రోజు శ్రీ అనంతాళ్వారువారు స్వయముగా శ్రీవారి కైంకర్యముకోసము తవ్విన చెరువును దర్శించుకున్నాము. ప్రతిరోజు శ్రీవారి దీపోత్సవ అనంతరము జరుగు మాడవీధులలో జరుగు ఊరేగింపులో పాల్గొని, శ్రీవారికి నైవేద్య, హారతి కైంకర్య సేవచేసి తరించినాము.   Photo: తిరుమల శ్రీవారి దర్శనభాగ్య విశేషములు
తిరుమల-తిరుపతి దేవస్థానమువారి దశవర్ష స్కీములో భాగంగా పదవసారి  మేము నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై అయిదు వరకు తిరుమలలో ఉన్నాము. నవంబర్ ఇరవైరెండున మా నలభైయ్యవ వివాహ వార్షికోత్సవము సందర్భమున మా చిరంజీవులు శ్రీవారి వసంతోత్సవమునకు టిక్కెట్లు తీసుకున్నారు. 
వైభవమంటపములో వసంతోత్సవ దర్శనము అపూర్వ అనుభవము .వైభవమంటపములో వసంతోత్సవ అనంతరము   ఆరోజు గురువారము అగుటచేత శ్రీవారి నేత్రదర్శనము శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గరగా  లభించినది. 
నవంబర్  ఇరవై మూడు దశవర్ష స్కీములో మొదటి రోజు దశమి సుప్రభాత దర్శనములో శుక్రవారము అగుటచేత తిరిగి నేత్రదర్శన (శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి) భాగ్యము కలిగినది.  దశవర్షస్కీములో భాగంగా తిరిగి వైకుంఠముద్వారా అదేరోజు మరో దర్శనము ఉండుటచేత, మళ్ళీ వైకుంఠముద్వారా వచ్చుటకు కష్టమగునని అక్కడేఉన్న ఆలయములోనున్న  సూపరెండెంటువారిని, ఇక్కడనుండే శ్రీవారిని దర్శించుటకు అనుమతించమని అభ్యర్ధించాము. వారు మా స్కీములో చివరి (పదవ)  సంవత్సరము అగుటచేత మా వయస్సు దృష్ట్యా  వారు ఆలయద్వజస్థంభమువద్దనుండే మమ్ములను శ్రీవారి దర్శనమునకు అనుమతించినారు. అది మాపాలిటి మరియొక వరమే అయి,  భగవంతుని నిజపాదదర్శనము శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గర లభించినది.

ఆ స్కీము రెండవరోజున మరియొకసారి శ్రీవారి  సుప్రభాతము సేవలో ఇరవైనాలుగువ తారీఖున పాల్గొని, శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గర ఒక దర్శనము,  మరల శీఘ్రదర్శనములో మరియొకసారి లఘుదర్శనములో శ్రీవారిని తిరిగి సేవించుకుని, శ్రీవారి శేషవస్రము, ఆడువారికిచ్చు రవికల గుడ్డ   , ఇరవై లడ్డు ప్రసాదములు తీసుకుని "రామ్ బగీచా" లోని మా బసకు చేరుకొన్నాము.
ఆఖరి రోజు శ్రీ అనంతాళ్వారువారు స్వయముగా శ్రీవారి కైంకర్యముకోసము తవ్విన చెరువును దర్శించుకున్నాము. ప్రతిరోజు శ్రీవారి దీపోత్సవ అనంతరము జరుగు మాడవీధులలో జరుగు ఊరేగింపులో పాల్గొని, శ్రీవారికి నైవేద్య, హారతి కైంకర్య సేవచేసి తరించినాము.

13 November, 2012

దీపావళి ముచ్చట్లు - 2

దీపావళి ముచ్చట్లు - 2




నాకు అప్పుడు పద్నాలుగేళ్ళుంటాయి. ఆ దీపావళికి మా పెద్దన్నయ్యకి ఉద్యోగం వచ్చి నాలుగు సంవత్సరాలయిపోయింది. మొత్తం మతాబాలు, చిచ్చుబుడ్లు తయారీ పని , నేను, మా పెద్దతమ్ముడు చి!సారధి తీసుకుని చేస్తున్నాము. వాడు "అన్నయ్యా! ఈసారి అవ్వాయి-సువ్వాయి" లు కూడా మనము తయారు చేద్దామా?"" అన్నాడు. "ఓరేయ్! నాన్నగారిచ్చిన డబ్బులు మనకి మతాబాలు, చిచ్చుబుడ్లకే సరిపోతాయి. అయినా అవ్వాయి-సువ్వాయి లు చేయడం మనకి రాదుకదా" అని వాడిని వెనక్కిలాగాను. కాని వాడు వినిపించుకోలేదు. ఎక్కడొ తిరిగి అవ్వాయి-సువ్వాయి లు ఎలా తయారు చెయ్యాలో అన్నీ తెలుసుకువచ్చాడు. అవ్వాయి-చువ్వయి గొట్టాలు తయారు చేయటం గమత్తుగా ఉంటుంది. మొత్తానికి వాడు ఆ గొట్టాలు తయారు చేస్తుంటే, నాకు కూడా ఉత్సాహం వచ్చి, "సరే! నేను మతాబాలలోని, సురేకారము కొంత ఇస్తాను. శ్యాంపిల్స్ బాగా వస్తే అప్పుడు చూద్దాం" అన్నాను. వాడు సాయంకాలం కల్లా పేకేజీ పెట్టెలు నాలుగు తెచ్చాడు. "ఇవెందుకురా?" అంటే, "ఇవి కాల్చి, బొగ్గుల పొడి తయారు చెయ్యాలి." అన్నాడు. రాత్రి దొడ్లో ఓ గొయ్యితీసి, కాగితాల మంట పెట్టి, ఆ నాలుగుపెట్టెలు ఆ గోతిలో వేసి తగలపెట్టాము.ఉదయాన్నే వెళ్ళి, ఆ బొగ్గులు, సంచీలో వేసి మెత్తగా

కొట్టీ పొడి చేశాము. అసలు పని ఆప్పుడే మొదలయ్యింది. "అన్నయ్యా! ఈ పొడికి అవ్వాయి-సువ్వాయి లు సరిగ్గా ఎగరవు. పొడి మెత్తగా ఉండాలి. మనం ఈ పొడి వస్త్రకాయితం పట్టాలి" ఆ పని రాత్రి మొదలుపెట్టాము. ఎవరికీ తెలియకూడదు. ఆ బొగ్గుపొడి వస్త్రకాయితం పట్తూంటే, పొడి బాగా మెత్తగా వచ్చిందికాని, ఇల్లు మా వళ్ళు నల్లగా తయారయ్యాయి. ముక్కుల్లోకి ఆ పొడి పోయి, ఇద్దరకీ ఎలర్జీ వచ్చి, చచ్చే తుమ్ములు వచ్చాయి. మా చిన్నతమ్ముడు మూర్తిని సహాయం అడిగాము. వాడు సహాయమము చేయక పోగా మేము అవ్వాయి-సువ్వాయి లు తయారుచేస్తున్నామని అమ్మతో చెప్పేశాడు. అమ్మ వచ్చి "ఒరేయ్! ఎందుకురా! ఈ పనులన్నీ. అడిగితే డబ్బులిచ్చేదాన్నికదా? మీరు ఈ పనులన్నీ ఎందుకు చెయ్యాలి. పైగా ఎమైనా ప్రమాదం అవుతుందేమో?" అని కంగారు పడింది. ఆవిడ కంగారు ఎందుకు పడుతోందో మాకు తెలుసు. అంతక్రితం ఏడాది కవులూరి వారింట్లో పెద్ద అగ్నిప్రమాదం జరిగి, ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. అదీ మా అమ్మగారి భయం. అమ్మకి చాలా నచ్చచెప్పాము. కవులూరు వారు " దీపావళి ఉల్లిపాయలు, అవీ పెద్దవి చేస్తున్నారు, అందుకని ప్రమాదం అయ్యింది" అని చెప్పి మా సారధి ఆవిడని ఒప్పించి, కాస్త ఆవిడ దగ్గరనుండి డబ్బులు కూడా మేనేజ్ చేశాడు. "బొగ్గు వస్త్రకాయితం" అయినతరువాత సురేకారము అలాగే చెయ్యాల్సివచ్చింది. మొత్తానికి ఐదురోజులు కష్టపడి, శ్యాంపిల్ "అవ్వాయి-సువ్వాయి" తయారయ్యింది. దాని పాళ్ళు సరిగ్గా సరిపోయాయి. అవి ముట్టించగానే, చేతులోంచే దూసుకుపోయేటట్లు తయారయ్యాయి. మా సంతోషానికి అంతేలేకుండా పోయింది. నెమ్మదిగా మొత్తం అవ్వాయి-సువ్వాయి ల మందు కలిపి వర్షం పడుతూంటే , వంటింటికి హాలుకి మధ్య మా పులిహొర పళ్ళెం లో దాదాపు రెండువందల అవ్వాయి-సువ్వాయిల మందు పెట్టుకుని వాటిని తయారుచేస్తున్నాము. ఒకటి కూడ తయారు కాలేదు. ఎక్కడినుంచి వచ్చాడో నా చిన్న తమ్ముడు మూర్తి " రేయ్ నాకో రెండు అవ్వాయి-సువ్వాయి లు ఇవ్వండిరా! నేను శ్యాంపిల్ చూస్తాను" అన్నాడు. సారధి తమ్ముడు " మాకు సహాయం చెయ్యమంటే, చేశావా? నీకు ఎందుకివ్వాలి. నీకు ఒక్కటి కూడా ఇవ్వము." అన్నాడు పులిహోర పళ్ళెము మీద చేతులుపెట్టి వంగిపోయి. " రేయ్! మర్యాదగా ఇస్తారా? లెదా?" అని వాడి బెదిరింపు.

"ఇవ్వముగాక, ఇవ్వము" అని వీడి మొండి సమాధానం. " నాకివ్వకపోతే, ఈ మందంతా తగలబెట్టేస్తా" అని వాడు ఎగశ్వాస పీలుస్తూ, చూపుడు వేలు చూపించాడు. "ఏదీ తగలబెట్టు! చూద్దాం"అని సారధి వాడిని రెట్టించాడు. అంతే! వాడు పరశురాముడిలా వంటింట్లో ఉన్న పొట్టు పొయ్యిలోనుండి, కాలుతున్న కట్టెపుల్ల తీసుకువచ్చాడు. నేను "రేయ్! మూర్తి ఆగరా! అన్నీ అయినతరువాత నీకు కూడా ఇస్తాము"

అన్నాను లేచి. తమ్ముడు సారధి కూడా లేచి వాడి చేయి పట్టుకుని వారించబొయాడు. వాడు ,వీడి చేయి ఒక్కసారి విదిలించుకుని, పులిహార పళ్ళెం వేపు కాలుతున్న కట్టెపుల్లతో ముందుకు వెళ్ళబోయాడు ఆ పెనుగులాటలో, ఓ నిప్పు కణం రెండువందల అవ్వాయి-సువ్వాయిల మందులొ పడింది. అంతే. మందు అంతా ఒక్కసారిగా భగ్గుమన్నది. ఇల్లంతా పొగ చుట్టుకుంది. ముగ్గురము వంటింట్లోంచి బయటకు పరిగెత్తాము. మంట ఎలా భగ్గుమన్నదో అలాగే ఒక్క క్షణంలో ఆరిపోయింది. పక్కనే రెండు అడుగుల దూరంలోనే, మా పండగ బట్టలు, రోజు పడుకునే పరుపులు, పక్క బట్టలు అన్నీ ఉన్నాయి. ఆ క్షణం లో భగవంతుడు మమల్ని, మా ఇంటిని కాపాడాడు. రెండు నిమిషాల తరువాత లోపలకి వచ్చి చూస్తే, పులిహర పళ్ళెం (అల్యూమినియమ్) కరిగి షేప్ మారిపోయి ఉంది. మూర్తి తమ్ముడు సాయంకాలం గాని మాకు కనపడలేదు. వాడు నవ్వుతూ " ఊరికే భయపెడదామని అనుకుంటే ఏమిట్రా! అలా అయ్యింది." అన్నాడు. అంత పొగ మా ఇంట్లోంచి రావటం చూసి, కంగారుగా చుట్టుపక్కల వాళ్ళు జరిగింది తెలుసుకుని "ఆమ్మో ఎంత ప్రమాదము తప్పింది " అంటూంటే, "పిల్లలు ఆ మాత్రము అల్లరి చెయ్యరా ఏమిటీ" అంటూ మా అమ్మ మాకు దిష్టి తియ్యటము కొస మెరుపు.

చిరంజీవి సారధి బాంక్ నుండి రెటైర్ అయితే , చిరంజీవి మూర్తి ఇంటెలింజెస్ ఆఫిసర్ గా రెటైర్ అయ్యాడు. ఇద్దరు తాతయ్యలు కూడా

కానీ ఈ విషయము అమ్మ నాన్నగారికి తెలియకుండా ఎలా మానేజ్ చేసిందో మా ముగ్గురికి తెలియదు.

దీపావళి ముచ్చట్లు -1

దీపావళి ముచ్చట్లు -1




ప్రతి దీపావళీ అందరికీ కొత్తగానే వుంటుంది. ఎన్ని దీపావళీలు గడిచినా, దీపావళి వస్తోందంటే, అదొక కొత్త ఉత్సాహం.

చిన్నప్పుడు మా ఇంట్లో మగపిల్లలం ఆరు, ఆడపిల్లలు ఐదు కాబట్టి, దీపావళి అంతా మా ఇంట్లోనే జరిగేది. నెల రోజులబట్టీ, మతాబాల గొట్టాలు మా శ్రీ భాస్కరన్నయ్య తయారు చేస్తూ ఉండేవాడు. మొత్తం పదకొండు మంది. దీపావళి ముందు నుంచి అమ్మ కార్తీక సోమవారాలు, పౌర్ణమి దాక ఉండాలి కాబట్టి, మతాబా గొట్టాలు ఓ రెండు వందలు తయారు చేశేవాడు. అవ్వన్నీ తయారు చేయటానికి, శ్రీ వేదాద్రి చిన్నన్నయ్య, నేను, భాస్కరన్నయ్యకు సహాయం చేశేవాళ్ళం. మతాబా గొట్టాలకి పేపర్లు, చుట్టటానికి కావలసిన గుండ్రటి వెదురు పుల్లలు అన్నీ సిద్ధము చేసుకుని కార్య రంగంలోకి ఉరికేవాడు శ్రీ భాస్కరన్నయ్య.

ఆ మతాబా గొట్టాలు తయారుచేయటానికి కావలసిన మైదా పిండి మా దుర్గక్కయ్య, పొట్టుపొయ్యమీద తయారు చేసి ఇస్తూండేది. అప్పటికింకా మా ఇంట్లో గ్యాస్ పొయ్యిలు రాలేదు. ఇవి 1958-59 ప్రాంతములో మేము విజయవాడ గవర్నరు పేటలో ఉండేటప్పటి ముచ్చట్లు.

మేము మతాబా గొలు రెండువందలు తయారు చేసి, అవి పెద్ద ఈత ఆకు చాపల మీద పెట్టి ఎండలో పెట్తే, అవి వంకర పోతుంటే, మా అన్నయ్య వచ్చి, వాటిని కాస్త నీడలోకి చాపతో సహా లాగుతుండేవాడు. అవి అలా రెండురోజులు ఎండబెట్టి, వాటిని, తీసుకెళ్ళి పందిరిమంచం క్రిందకి ఎవరూ తొక్కకుండా ఉండేందుకు, తోసేసేవాడు. ఇంక పెద్దన్నయ్యతో, మతాబాలకి కావలసిన ముడి సరుకులు కొనుక్కుని రావడం ఓ సరదాగా ఉండేది. ఇనుపరజను, గంధకము, సురేకారము, పొడిసున్నము, ఆముదము, ఇవి కావలసినవి. అవి గవర్నరుపేట "చెట్లబజారులో" దొరికేవి. అక్కడ దాదాపు నాలుగు వీశెలు (పాత తులామానము, వీశె అంటే పద్నాలుగు వందల గ్రాంలు) కొనుక్కుని,తిరిగి వచ్చేటప్పుడు, అరండల్ సత్రము దగ్గర ఖాళీ మట్టి చిచ్చు బుడ్లు ఓ రెండు డజన్లు, ప్రమిదలు ఓ వంద అన్నయ్య కొనేవాడు. ఇవ్వన్నీ కొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఓ రెండు గంటలు పట్టేది. అంటే పొద్దున్న ఎనిమిదికి వెళ్తే, ఇంటికివచ్చేసరికి, పదయ్యేది.

ఇఖ అన్నయ్య ఆ మందు సామన్లన్ని, మా ఇంట్లో చివర గదిలోకి చేర్చి, మేమవరము రాకుండా, ఆ రజను, గంధకము, నూరినసురేకారము, సున్నము, అన్నీ చెత్తాచెదారము లేకుండా తనొక్కడే శుభ్రము చేశేవాడు. మేము లోపలకి వెళ్ళకుండా, కిటికీలోనుండి, అన్నీ విచిత్రముగా చూశేవాళ్ళము. ఆ పని అయిన తరువాత అవ్వన్నీ ఎండబెట్టేవాడు. చిచ్చుబుడ్ల మూతులు (చిన్నకంతలకు) చిన్న కాగితాలతో, మూసేసేవాడు. అన్నీ ఓ రెండు మూడురోజులు ఎండబెట్టి, మాఇంట్లో పెద్ద పులిహార పళ్ళములో , ఓ రాత్రి పూట అన్నీ కలిపి మతాబాల మందు తయారు చేశేవాడు. మా అమ్మ చేత "శాంపిల్" మతాబా కాల్పించేవాడు. అది బాగా పువ్వులు పడుతూ ఆగకుండా కాలితే, అన్ని మతాబాలు తయారు చేసేవాడు. ఈ మతాబాలు కూరటంలో ఇంట్లో మగపిల్లలము అందరము సహాయము చేసేవారము. మతాబు గట్టిగా రావాలని అన్నయ్య మధ్య మధ్య హెచ్చరిస్తూ ఉండేవాడు. మతాబా చివర కాస్త "ఇసక" పోసి తయారు చెయ్యమని అమ్మ చెపుతూ ఉండెది. చిన్నపిల్లలు చేతులు కాల్చుకుంటారని అమ్మ హెచ్చరిస్తు ఉండేది. చిచ్చుబుడ్లు మాత్రము అన్నయ్యే అన్నీ చేస్తూండేవాడు. మొదట ప్రత్యేకముగా తను బజారు నుండి తెచ్చిన "జిల్లీ" అనే మందు పోసి, దానిమీద మతాబు మందు జాగ్రత్తగా ఎక్కువ వత్తిడి లేకుండా కూరి వెనకాల మళ్ళీ కాగితాలు అన్నీ కూరి, బంకమట్టితో మూసేశేవాడు. చిచ్చుబుడ్లుకూడా "శ్యాంపిల్స్" అంటూ అన్నయ్యే ముట్టించేవాడు. అది పగలే అయినా అది పువ్వులు పైకి విరజిమ్ముతూంటే, ఆనందంతో గంతులేసేవాళ్ళం. పైగా అది మా అన్నయ్య సొంత తయారీ కదా! అదీ గర్వం.

అన్నయ్యకి ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్ళటం వలన ఓ ఆరేడు సంవత్సరాల తరువాత ఈ పని అంతా నేనే చూశేవాడిని. అయితే ఇంత భారీగా ఉండేది కాదు. ఎందుకంటే, ఇద్దరు అక్కయ్యలు అత్తవారిళ్ళకు, వెళ్ళారు. ఓ అన్నయ్య ఉద్యోగం, ఇంకో అన్నయ్య పెద్ద చదువు, దీపావళీ ఖర్చు , ఇవ్వన్నీ కలిపి నా పని భారం తగ్గించేశాయి. ఐనా ఉత్సాహం తగ్గక, అలాగే చేస్తూండేవాళ్ళము, నేను, మాసారధి తమ్ముడు, మూర్తి తమ్ముడు. ఓ సారి మా ఇంట్లో దీపావళీ సీజనులో ఓ పెద్ద అగ్నిపమాదం జరిగింది. ఆ విశేషాలు చెప్పబోయేముందు, ఓ చిన్న డిన్నర్ బ్రేక్.

నందన దీపావళి శుభాకాంక్షలు



                              నందన దీపావళి  శుభాకాంక్షలు


             కీసర వంశస్తులందరికీ  నందన నామ సంవత్సర దీపావళి  శుభాకాంక్షలు




కీసర వంశస్తులందరికీ నందన నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు


 

12 November, 2012

నా పుట్టిన రోజు ఫోటోలు


  నా 65 జన్మదినము ఆరు నవంబర్ న చి.సునీల్ కుమార్ , చి.స్వప్న సుందరి నన్ను నూతన వస్త్రములతో సత్కరించి, కుటుంబ సభ్యులతో పాదాభివందనం చేసి వారి ప్రేమ,గౌరావాభిమానములు తెలియచేశారు.

ఆ సందర్బముగా చి.స్వప్న కొన్ని చాయాచిత్రములు మనకోసం తీసినది. అవి మీకోసం ఇక్కడ పొందు పొరుస్తున్నాను.







06 November, 2012

కీసర సాయి సాలగ్రామ నరసింహ శర్మ 65 వ జన్మదినము


 మీ మోడరేటర్ , ఈ బ్లాగు సృష్టి కర్త అయిన  కీసర  సాయి  సాలగ్రామ  నరసింహ శర్మ 65 వ జన్మదినము ఈ  రోజు. కావున కీసర వంశజులందరికి తెలియచేయడమైనది. కీసర వంశములోని పెద్దలందరికీ పాదాభివందనములు.









29 October, 2012

చి.పార్ధసారధి 62వ పుట్టిన రోజు సందర్భమున శుభాశ్శీసులు\శుభాకాంక్షలు


చి.పార్ధసారధి 62వ పుట్టిన రోజు సందర్భమున శుభాశ్శీసులు\శుభాకాంక్షలు

గుంటూరు మారుతీనగర్ లో ఈరోజు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్న చి.పార్ధసారధికి కీసరవంశస్థులందరు
శుభాశ్శీసులు \ శుభాకాంక్షలు అందిస్తున్నాము. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో, మరెన్నో, ఎన్నేన్నో ఆనందంగా, హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, భగదనుగ్రహంతో జరుపుకోవాలని ఆంకాక్షిస్తున్నాము.
ఆయురారోగ్య,ఐశ్వార్యాభివృద్ధిరస్తు. వంశాభివృద్ధిరస్తు.



 

19 October, 2012

అత్త బంగారం - కోడలు సింగారం

అత్త బంగారం - కోడలు సింగారం


ఈ టీవీ లో ది.14.10.2012 ప్రసారమయిన "అత్త బంగారం - కోడలు సింగారం" కార్యక్రమములో

చి.లక్ష్మినరసింహ మూర్తి భార్య చి.భారతి, కోడలు చి. సౌమ్య పాల్గొని మన అందరకు సంతోషము కలిగించారు. సదరు కార్యక్రమము మెత్తం వీడియోలు "యూట్యూబ్" నుండి లబ్యమయినవి, మన

అందరి వీక్షణకు ఇక్కడ పొందుపరచటమైనది. కార్యక్రమములో మంచి హుషారుగా పాల్గొని వీక్షకులకు ఆనందము కలిగించిన చి.భారతిని, చి. సౌమ్యని అభినందిస్తూ, ఆశ్శీసులు అందచేస్తున్నాము.

వీడియోలు క్రింద చూడండి.


10 October, 2012

చి.సునీల్,స్వప్నల తొమ్మిదవ వివాహ వార్షికోత్సవము

ఈ రోజు అనగా 10.10.2012 న ఢిల్లీలో చి.సునీల్ కుమార్, చి.స్వప్న సుందరీ తొమ్మదవ వివాహ వార్షికోతవము

జరుపుకుంటున్నారు. ఈ సందర్భముగా కీసర వంశస్థులందరూ వారికి








శుభాశీస్సులు/శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


 

29 September, 2012

చిరంజీవి స్వర్ణమంజరి స్కూల్లో వేసిన "పిల్లి" వేషానికి సెకండ్ ప్రైజ్ వచ్చిందో హో


చిరంజీవి స్వర్ణమంజరి స్కూల్లో వేసిన "పిల్లి" వేషానికి సెకండ్ ప్రైజ్ వచ్చిందో హో


                       

చిరంజీవి స్వర్ణ మంజరి ప్లే స్కూల్ లో "పిల్లి" వేషము


  చిరంజీవి స్వర్ణమంజరి నిన్న అంటే ది.28.08.2012 న తన  స్కూల్ "రివేరా ప్లే" స్కూల్ లో పిల్లి వేషం

        వేసింది. తను పిల్లి మేకప్ చేసుకుని వెడుతుండగా తీసిన చాయాచిత్రము మీకోసం.


                            

04 September, 2012

నూతన శిశోదయం

నూతన శిశోదయం




చి!ధశరధ రామ నరసింహ శర్మ (రాంబాబు జగ్గయ్యపేట) కుమారుడు, చి!నరసింహారావు, చి!జ్యోతిర్మయిలకు, హైదరాబాదులో ఆగష్టు 20న మద్యాహ్నం 3.30 ని!!లకు కుమార్తె జన్మించినదని తెలుపుటకు సంతోషిస్తున్నాము. తల్లి, శిశువు కులాసా వున్నారు. కీసర వంశస్థులందరు నూతన తల్లిదండ్రులను అభినందిస్తూ, శిశువుకు, వారిరువురకు ఆశ్శీసులందచేస్తున్నాము.

28 August, 2012

చిరంజీవి భరద్వాజ్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

పూనాలో ఈ రోజు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న చిరంజీవి భరద్వాజ్ కుమార్ కు


                       కీసర వంశస్థులందరి తరఫున "పుట్టిన రోజు శుభాకాంక్షలు" తెలుపుతున్నాము.


26 August, 2012

నీల్ ఆమ్ స్ట్రాంగ్ - మా నాయనమ్మ

నీల్ ఆమ్ స్ట్రాంగ్ - మా నాయనమ్మ



నీల్ ఆమ్ స్ట్రాంగ్ - చందమామ మీద కాలు పెట్టిన మొదటి మానవుడు చనిపోయాడని తెలిసి బాధపడని మానవుడుండడు. 1969 జులై 20న అందరిలాగే నందిగామలో రాత్రి దాదాపు భారతీయ కాలమానము ప్రకారం అర్ధరాత్రి వాయిస్ ఆఫ్ అమెరికా నుండి వ్యాఖ్యానము వింటూ ఏదో తెలియని ఆనందములో తేలిపోయాను. ఆ వార్త, ఆ ఆనందము పంచుకోవటానికి ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. మా నాయనమ్మ గదిలోనుండి ఏదో శబ్ధము అయితే గదిలోకి తొంగి చూశాను. ఆవిడ మంచినీళ్ళకోసం లేచింది. ఆవిడ నీళ్ళు తాగేంతవరకు ఆగి, "నాయనమ్మా! మనిషి చందమామ మీద అడుగుపెట్టాడు" అని ఆవిడకు ఆ వార్త అందించి ఆవిడ కాళ్ళకు నమస్కరించాను. ఆవిడకు వయస్సు 82 ఏళ్ళు. వార్త ప్రాముఖ్యము ఆవిడకు అర్ధమయ్యిందో లేదో నాకు తెలియలేదుకాని, " మీ తాతయ్య గారు ఉంటే బాగుండేదిరా" అంటూ కళ్ళు వత్తుకుంది.

24 August, 2012

శ్రీ హనుమంతుని వేదాంతం కధ


శ్రీ హనుమంతుని వేదాంతం కధ

ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .

”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు .

22 August, 2012

కీసరవంశము మొదటి ముగ్గురన్నదమ్ములు


వేంకటరామ నరసింహా రావు -- మద్యలోనున్నవారు
జ్వాలానరసింహాశర్మ ------- కుడివైపునున్నవారు
యోగానంద నరసింహశర్మ ---- ఎడమవైపునున్నవారు

         

18 July, 2012

మా మాతృమూర్తి, కీసర వంశము పెద్దకోడలు కీ.శే. సరస్వతి ప్రసునాంబ గారి 88వ జన్మదినం

మా మాతృమూర్తి, కీసర వంశము పెద్దకోడలు కీ.శే. సరస్వతి ప్రసునాంబ గారి 88వ జన్మదిన సందర్భమున వారి దివ్యసృతికి కీసరవంశము ఘనంగా నివాళులర్పిస్తోంది.







                                                                                          

15 July, 2012

మా చతుర్ధామ యాత్ర

మా చతుర్ధామ యాత్ర


మా చతుర్ధామ యాత్ర చూడటానికి ఈ క్రింద నున్న లింకు నొక్కండి.


http://jajisarma.blogspot.in/

20 June, 2012

చి.నాగశ్రీవల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పూనాలో పుట్టిన రోజు జరుపుకుంటున్న మాపెద్ద కోడలు చి.నాగశ్రీవల్లిని, దీవిస్తూ,


               

                                                                         ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష


                                                                         శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి



చి.ఉమాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కీసరవారి నాలుగవకోడలు చి.పార్ధసారధి ధర్మపత్ని,


                                                             చి.ఉమాదేవిని

Bouquet : colorful bouquet of flowers isolated on white background






                                                " ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష

                                                  శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి"

                                                               అని దీవిస్తున్నాము.



19 June, 2012

చి.చైతన్య "స్టార్ ఫర్ ఫార్మర్" (STAR PERFORMER) 2011-12





                                                                                                                   

            


           చి.చైతన్య "స్టార్ ఫర్ ఫార్మర్" (STAR PERFORMER) 2011-12




                 చి. చైతన్య తను పనిచేసే కొయ్ సెరా కంపెనీలో 2011-12 సంవత్సరమునకు

                                                 "స్టార్ ఫర్ ఫార్మర్" గా

                                                      నిలిచాడు.

       ఈ ప్రతిభావంతమైన పనిపాటవమునకు "కొయ్ సెరా" కంపెనీవారు చి.చైతన్యను జూన్ 13, 2012 న

       సింగపూర్ లో జరిగిన సమావేశములో సన్మానించారు.

కీసరవంశస్థులందరు మనవంశము పేరు-ప్రతిష్టలు ఖండాతరములలో వ్యాప్తి చేస్తున్న చి.చైతన్యను అభినందిస్తున్నాము. కంపెనీ వారిచ్చిన సర్టిఫికెట్ ఇక్కడ పొందుపరచడమైనది.




                                                                                                                


                                                                                                         

10 June, 2012

గీతశ్లోకము పఠిస్తున్న చి.హర్షితకు ఆశ్శీసులతో కూడిన జేజేలు.

చి.చైతన్య,చి.సౌమ్యల ముద్దుపెద్దపాప చి.హర్షిత వేసవి సెలవలు వృధాకానివ్వకుండా ఓ వేసవి విడిదిలో పాల్గొని తన భావాలకు మెరుగు దిద్దుకుంది. ఈ చిరంజీవి ఆ విడిది ముంగింపునందు గీతశ్లోకము పఠిస్తున్న చాయచిత్రమిది. చి.హర్షితకు ఆశ్శీసులతో కూడిన జేజేలు.

                                                                

02 June, 2012

కీసర వంశము - KEESARA VAMSAM: దండం దశ గుణం భవేత్

కీసర వంశము - KEESARA VAMSAM:SPECIAL POSTS

దండం దశ గుణం భవేత్

దండం దశ గుణం భవేత్ అనే మాట తరుచుగా వింటూ ఉంటాం కదా?
దాని పూర్తి పాఠం చూదాం ...

విశ్వా మిత్రా హి పశుషు, కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

వి = పక్షులు
శ్వా = కుక్కలు
అమిత్ర = శత్రువులు
అహి = పాములు
పశు = పశువులు ( వీటిని అదుపు చేయడానికిన్నీ)

కర్దమేషు = బురదలో
జలేషుచ = నీటిలో
అంధే = గుడ్డితనంలో
తమసి = చీకటిలో
వార్ధక్యే = ముసలితనంలో ( సాయంగా ఉండేది కర్ర.)
( ఈ విధంగా)

దండం = కర్ర
దశగుణమ్ = పది విధాలయిన
గుణమ్ = గుణములు కలది
భవేత్ = అగుచున్నది.

అంటే, చేతి కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడుతుంది.

అంతే కాక, బురదలో సజావుగా నడవడానికి, నీటిలో లోతు చూసుకుంటూ దిగడానికీ, చీకటిలో తడుముకుంటూ క్షేమంగా వెళ్ళడానికీ, గుడ్డితనంలో ఆసరాగానూ, ముసలితనంలో ఊతగానూ ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేతి కర్ర పదిరకాలుగా మనకు ఉపయోగ పడుతున్నదన్నమాట.

శ్లోకం అర్ధం ఇలా ఉంటే, మనలో చాలమంది ఎందుకో, దండించడం వల్ల ( శిక్షించడం వల్ల) పదిలాభాలు ఉన్నాయి .. వంటి అర్ధాలు చెబుతూ ఉంటారు. దండం అనే పదాన్ని దండన అనుకోవడం వలన ఈ భావం కలుగుతూ ఉండొచ్చును.

28 May, 2012

ఈరోజు రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న చి!! యశస్విని స్వర్ణమంజరి కి సాయితాతయ్య, జగదీశ్వరి నానమ్మ, భరద్వాజ్ కుమార్ పెద్దనాన్న, నాగశ్రీవల్లి ఆమ్మ (దొడ్డమ్మ), మహాన్యాస్ అన్నయ్య, సహిష్ణు అన్నయ్య,అత్యంత ప్రేమతో శుభాశ్శీసులు అందిస్తూ,
   

                                       "ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష

                                        సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి"

                                      అని ఆశీర్వదిస్తూ, ముద్దులు అందిస్తున్నాము.




















కీసర వంశము***** KEESARAVAMSAM