చిరంజీవి సారధి షష్ట్యబ్ధి మహోత్సవము
చిరంజీవి సారధి షష్ట్యబ్ధి మహోత్సవము అతి వైభవముగా, పండితుల పవిత్రవేదమంత్రస్వరములతో బంధుమిత్రుల కోలాహలముమధ్య, చిన్నారులకిలకిలరావములతో మొదటిరోజు ది. ౨౬.౧౦.౨౦౧౦ మంగళస్నానములతో, ప్రారంభమయినవి.
తోలుత మన సంప్రదాయ ప్రకారము బావగారు శ్రీజయంతివేంకటేశ్వరరావుగారిదంపతులను, శ్రీవేదాద్రి అన్నయ్య దంపతులను, శ్రీసాయిఅన్నయ్యదంపతులను పట్టువస్రములతోసత్కరించి, ప్రధాన ఋత్విక్కుశ్రీ వేలమూరి అరుణకాంత్ శర్మ నిర్మించిన మహమంటపమున అంకురార్పణ కావించి, విఘ్నాధిపతి ఆదిపూజ్యుడు, వినాయప్రభువును, మహామంటపమునకు అహ్వానించి, పూజించి, ఆప్రభువును ఈక్రతువు నిర్విఘ్నముగా కొనసాగుటకు మనసారా ప్రార్ధించారు. ప్రభవాది షష్టి సంవత్సరములను, నవగ్రహములను, అష్టదిక్పాలకులను, సర్వదేవతలను ఆహ్వనించి,సశాస్త్రీయంగా చిరంజీవి సారధి దంపతులు ఆరాధించారు.
మన ఇలవేల్పు శ్రీచెంచులక్ష్మి, శ్రీఆదిలక్ష్మిసమేత శ్రీశ్రీశ్రీయోగానందలక్ష్మినారసింహస్వామివార్లను కలశమునందు ఆవాహనముగావించారు.
అటుపిమ్మట ప్రాణపతిష్టగావించి, శ్రీస్వామిని శ్రీసూక్త,పురుషసూక్త, వషట్కాకారములతో, ఆరాధించారు.
చి!!సారధి,చి!!ఉమలకు మన శుభాశ్శీసులు అందిస్తూ శ్రీవేదాద్రిఅన్నయ్య, శ్రీమతికాత్యాయని వదిన నూతన వస్త్రములు అందించి దీవించారు.
మీ మోడరేటర్ కూడ సతీసమేతంగా, షష్ట్యబ్ధి దంపతులను నూతన వస్త్రములతో అలంకరించి ఆశీర్వదించారు.
అతి తొందరలో ఈమహోత్సవమునకు సంబంధించిన పూర్తి కధనము, ఛాయచిత్రములు, చలనచిత్రములు మీముందుంచగలను.
ఓం తత్సత్.
VIDEOS AND PHOTOS WILL BE IN THE NEXT ISSUE