26 August, 2012

నీల్ ఆమ్ స్ట్రాంగ్ - మా నాయనమ్మ

నీల్ ఆమ్ స్ట్రాంగ్ - మా నాయనమ్మ



నీల్ ఆమ్ స్ట్రాంగ్ - చందమామ మీద కాలు పెట్టిన మొదటి మానవుడు చనిపోయాడని తెలిసి బాధపడని మానవుడుండడు. 1969 జులై 20న అందరిలాగే నందిగామలో రాత్రి దాదాపు భారతీయ కాలమానము ప్రకారం అర్ధరాత్రి వాయిస్ ఆఫ్ అమెరికా నుండి వ్యాఖ్యానము వింటూ ఏదో తెలియని ఆనందములో తేలిపోయాను. ఆ వార్త, ఆ ఆనందము పంచుకోవటానికి ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. మా నాయనమ్మ గదిలోనుండి ఏదో శబ్ధము అయితే గదిలోకి తొంగి చూశాను. ఆవిడ మంచినీళ్ళకోసం లేచింది. ఆవిడ నీళ్ళు తాగేంతవరకు ఆగి, "నాయనమ్మా! మనిషి చందమామ మీద అడుగుపెట్టాడు" అని ఆవిడకు ఆ వార్త అందించి ఆవిడ కాళ్ళకు నమస్కరించాను. ఆవిడకు వయస్సు 82 ఏళ్ళు. వార్త ప్రాముఖ్యము ఆవిడకు అర్ధమయ్యిందో లేదో నాకు తెలియలేదుకాని, " మీ తాతయ్య గారు ఉంటే బాగుండేదిరా" అంటూ కళ్ళు వత్తుకుంది.

కీసర వంశము***** KEESARAVAMSAM