చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి నాగశ్రీవల్లి ల వివాహ వార్షికోత్సవము 17వది 8వ మార్చి న పూనాలో జరుపుకున్నారు ఆ సందర్భంగా నా ఫేస్బుక్ మిత్రుల స్పందన ఇక్కడ చూడవచ్చు.
ఈక్రింది శ్రుంఖల క్లిక్ చెయ్యండి.
చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి నాగశ్రీవల్లి ల వివాహ వార్షికోత్సవ స్పందన
ఒక మిత్రుడు శ్రీ చింతా రామకృష్ణరావు గారు శార్దూలవిక్రీడితము ద్వారా తమ ఆశీస్సులు అందించారు.
ఆ పద్యం :
శా రాజీవాక్షుఁడు రాముడేలు మనసారా నాగవల్లీ భర
ద్వాజున్. బ్రోచుత నూరువత్సరములీ ధాత్రిన్ శుభోద్దీప్తితో.
ప్రాజాపత్య ఫలంబుతో సుఖముగా వర్ధిల్లుడిద్ధాత్రిపై.
మీజన్మంబున భారతాంబ సుఖియై మిమ్మున్ప్రవర్ధించుతన్.
చిరంజీవులారా! మీకు పెండ్లిరోజు శుభాకాంక్షలు.
మరొకరు శ్రీమాన్ సంపత్ కుమార్ గారు సంస్కృత శ్లోకం ద్వారా తమ ఆశీస్సులు అందించారు.
ఆ శ్లోకం ఇది :
దీర్ఘాయురారోగ్యమఖండభూతిం!
సామ్రాజ్యవృద్ధిం సకలేష్ట సిద్ధిమ్!
కళ్యాణ బుద్ధిం శ్రితపోషవృద్ధిం!
భద్రాద్రిరామో దిశతాత్ సదావ:!!
సామ్రాజ్యవృద్ధిం సకలేష్ట సిద్ధిమ్!
కళ్యాణ బుద్ధిం శ్రితపోషవృద్ధిం!
భద్రాద్రిరామో దిశతాత్ సదావ:!!
శ్రీ పద్మావతి అలిమేలు సమేత ఆ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి ఈ దంపతులను ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు.
జై శ్రీమన్నారాయణ !! జై శ్రీమన్నారాయణ !! జై శ్రీమన్నారాయణ !!