16 May, 2011

పవిత్ర గంగాపుష్కరములలో పితృకార్యము

పవిత్ర గంగాపుష్కరములలో పితృకార్యము


వైశాఖ శుద్ధ పంచమి నుండి పవిత్ర గంగానదికి పుష్కరములు ప్రారంభమయినవి. సమస్త నదులు అంశామాత్రముగా గంగానదిలో ప్రవేశిస్తాయని హిందూశాస్త్రములు చెపుతున్నాయి. ఈ పవిత్ర సమయములో పితృదేవతలకు పుష్కరమునిచ్చుట అనుచారముగా వస్తున్నది.



ఈ సందర్భము పురస్కరించుకుని, సాయిఅన్నయ్య హరిద్వార్ లో, పవిత్ర గంగానది పుష్కరము ప్రారంభమయిన రోజుననే, అంటే, వైశాఖ శుద్ధ పంచమి రోజునే,

ధర్మపత్ని చి.జగదీశ్వరి, ద్వితీయపుత్రుడు చి.సునీల్ కుమార్,కోడలు చి.స్వప్నసుందరి, ప్రధమ మనుమరాలు చి.సౌందర్యలహరి, ద్వితీయ మనుమరాలు చి. స్వర్ణమంజరి, తోడురాగా , యావత్కార్యక్రమము శ్రీవాసుదేవశర్మగారి యాజ్జ్యవల్క్యములో ద్విగ్విజయముగా పుష్కరము గావించాడు.



ప్రితృదేవతలు కీ.శే. వేంకటరామనరసింహారావు గార్కి, మాతృమూర్తి కీ.శే.సరస్వతీప్రసూనాంబగారితో సహా, మొత్తము 52 మందికి

పిండప్రదానము సహా తర్పణములొసగబడినవి.



ఈ కార్యక్రమము హరిద్వారములో  ఇంత విశేషముగా జరుగుట మా పూరాకృత పుణ్యవిశేషముగా భావిస్తున్నాము.



ఎంతో శ్రద్ధతో, శ్రమతీసుకుని అన్ని ఏర్పాట్లు చేసిన చి.సునీల్ కుమార్, చి.స్వప్నసుందరీ లను ఈ సందర్భముగా

ప్రత్యేకముగా అభినందిస్తూ, ఆశీర్వదిస్తున్నాము. స్వస్తి.



ఈ సందర్భముగా తీసిన ఛాయాచిత్రములు కొన్ని మీ కన్నుల పండుగ చేస్తాయి. ఇవిగో అవి.





కీసర వంశము***** KEESARAVAMSAM