09 August, 2017

కీర్తిశేషులయిన శ్రీ వేదాద్రి అన్నయ్య !!




             కీర్తిశేషులయిన  శ్రీ వేదాద్రి అన్నయ్య   !!


       శ్రీ  కీసర వేంకట రామ నరసింహారావు, శ్రీమతి సరస్వతీ ప్రసునాంబల ద్వితీయ పుత్రుడు

        శ్రీ వేదాద్రి నరసింహ శర్మ (71) ఈ రోజు అనగా శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ

        బహుళ తదియ నాడు తెల్లవారుఝామున 3.30 లకు సరియగు 2017 వ సంవత్సరం ఆగస్టు

       తొమ్మిదివ తారీఖు (9.08.2017)   తుదిశ్వాస విడిచారు.


          కుటుంబ పెద్దను కోల్పోయాము.

 అందరికీ ప్రేమాస్పదుడయిన అన్నయ్య పెనుగంచి ప్రోలు పట్టణములోనే గాకా, ఆ మండలము మొత్తం " శ్రీ వేదాద్రి గురుస్వామి " గా ప్రఖ్యాతి గాంచాడు.  అన్నయ్య అంత్యక్రియలు బంధు,మిత్రుల సమక్షములో, వారి అయ్యప్ప శిష్య గణం మధ్య అన్నయ్య ఎకైక పుత్రుడు చి.వంశీకృష్ణ నిర్వహించాడు. అంత్యక్రియలు  ఈ సాయంకాలం జరిగినవి.

     ఆన్నయ్య ఏకైక పుత్రుడు చి.వంశీకృష్ణ కు అనేక అధికార, అనధికార ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.

     శ్రీ వేదాద్రి అన్నయ్య బౌతికంగా మనలను వీడినా మన హృదయాలలో "శ్రీ వేదాద్రి గురుస్వామి " గా నిలచిపోతారు.

       శ్రీ వేదాద్రి అన్నయ్యకు నా అశ్రునివాళి !!





   


     

కీసర వంశము***** KEESARAVAMSAM