28 May, 2012

ఈరోజు రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న చి!! యశస్విని స్వర్ణమంజరి కి సాయితాతయ్య, జగదీశ్వరి నానమ్మ, భరద్వాజ్ కుమార్ పెద్దనాన్న, నాగశ్రీవల్లి ఆమ్మ (దొడ్డమ్మ), మహాన్యాస్ అన్నయ్య, సహిష్ణు అన్నయ్య,అత్యంత ప్రేమతో శుభాశ్శీసులు అందిస్తూ,
   

                                       "ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష

                                        సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి"

                                      అని ఆశీర్వదిస్తూ, ముద్దులు అందిస్తున్నాము.




















26 May, 2012

చి!సౌందర్యలహరి, చి!స్వర్ణమంజరిల పుట్టినరోజు మహోత్సవాహ్వానము

                         చి!సౌందర్యలహరి, చి!స్వర్ణమంజరిల పుట్టినరోజు మహోత్సవాహ్వానము

24 May, 2012

దైవము - లీలలు

మనము చేసే పాపపుణ్యాలను బట్టీ దైవము


ఫలితాలనిస్తుంది అని మన సనాతన ధర్మం బోధిస్తోంది. వివరంగా చెప్పాలంటే,

మనం చేసే పాపపుణ్యాలు మూడు విభాగాలుగా ఉంటాయి.

ఒకటి. అతిసామాన్య పుణ్యము అతిసామాన్య పాపము. .

రెండు. సామాన్య పుణ్యము. సామాన్య పాపము.

మూడు. అనన్య సామాన్య పుణ్యము. అతి ఘోర పాపము.



దైవము అతిసామాన్య పుణ్యములను, అతిసామాన్య పాపములను, కలలో అనుభవించేవిధముగా చేస్తుంది.

ఉదాహరణకు మనం బిక్షాటనకు వచ్చేవానికి దానం చేయలనుకుని జేబులో చెయ్యిపెట్టుకుంటే,

మనం అనుకున్న పైకం, జేబులో సమయానికి లేకపోతుంది. మనం మనస్సులో నొచ్చుకుంటాము.

ఈలోపల మన ఎక్కవలసిన బస్సు వచ్చేస్తుంది. మనం దానం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాము.దానం చేయాలనే భావన రావడం కూడా ఒకరకమైన పుణ్యమే. కాని దానం చేయలేదు కాబట్టి ఇది అతిసామాన్య పుణ్యఖాతాలోనికి వెళుతుందన్నమాట.

ఇలాంటిఅతిసామాన్య పుణ్యాలను మనము కలలో " ఏదో పదోన్నతి పొందినట్లో" అనుభవింపచేస్తుంది. అలాగే అతిసామాన్య పాపములు.



ఇఖ అనన్య సామాన్య పుణ్యములను, అతి ఘోరపాపములను ఈ జన్మలోనే అనుభవించేటట్లు చేస్తుంది.

మనం ఎదో పెద్దయాగము చేశామనుకోండి, దైవము ఆ ఫలితము ఈజన్మలోనే అనుభవింపచేస్తుంది. అలాగే అతి ఘోరపాపములు చేసేవారు కూడా ఈ జన్మలోనే దాని ఫలితము అనుభవించేటట్లు చేస్తుంది. సంఘములో అవినీతికి పాల్పడినవారిని ప్రభుత్వము, శాసనము శిక్షించడము ఈ కోవలోనికే వస్తుంది.

ఇఖ సామాన్య పుణ్యపాపములను దైవము ముందు జన్మలలో అనుభవింపచేస్తుంది.

ఈ సామాన్య పుణ్యఫలితము దైవం ప్రకృతి భీభస్తమములలో మీ పుణ్యఫలితమును ఉపయోగించి సృష్టిని కాపాడి మీ పుణ్యమును అనేక రెట్లు పెంచి మీకు కావలసిన సమయములో ఆ పుణ్య ఫలితమును అందిస్తుంది.



అదేవిధముగ మనము చేసే పాపములను అనుభవించటానికి వలసిన ఓర్పును నేర్పును మనకు కాలక్రమేణా అందేటట్లు చేస్తుంది.

కాబట్టి దైవలీలలను మనము ఓర్పుతో అర్ధము చేసుకుని, సహనము వహించి, దైవభక్తితో ఉండటము అలవాటు చేసుకోవాలి. దైవమును దూషించరాదు.

శ్రీరామాయణములో రాముని పట్టాభిషేకము రేపు అనగా, రాత్రికి రాత్రి ఘట్టములు సంభవించి శ్రీరాముడు అడవులకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తే, లక్ష్మణస్వామి చలించిపోయి "అన్నయ్యా! నాకు అనుమతినిస్తే తండ్రిని ఎదిరించి, నీకు పట్టాభిషేకము చేస్తా! ఏమిటి! దైవము, దైవము అంటావు?" అని దైవదూషణకు దిగుతాడు. అప్పుడు శ్రీరాముడు ఎంతో ఓర్పుతో "లక్ష్మణా! దైవము నీకు కనబడితేకదా? నువ్వు దైవాన్ని ఎమైనా చేశేది?" అని వారించి లక్ష్మణస్వామిని దైవదూషణా పాపాన్నించి తప్పించి అడవులకు పయనమవుతాడు.

ఇక్కడ గమనించాల్సింది," కనపడని దైవాన్ని నిందించి ప్రయోజనము లేదు,దైవశాసనాన్ని పాలించడమే మానవకర్తవ్యం" అనే శ్రీరామవాక్యాన్ని.

కాబట్టి మనమందరం సదా మన మనస్సనే రాగి చెంబును మలినం కాకుండా భక్తి అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోముతూ, నిరంతరము దైవచింతనతో ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, జీవితంలో కలిగే ఆటుపోటులకు కృంగిపోకుండా సాగిపోయేటట్లు,

చేసుకోవాలి. దానికి పూర్తిశరణాగతి ఒక్కటే మార్గము. భగవంతుని పాదములు మనస్సులో తలచుకుని, ఆయన పాదములు

పట్టుకుని, " నేను నీశరణాగతుడను, నీపాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. జన్మజన్మలలో నేను చేసిన పాపములు మన్నించి, నన్నురక్షించు, తండ్రీ," అను ఆర్తితో ప్రార్ధించండి. ఆ ప్రార్ధనకు భగవంతుడు కరిగిపోయి, మీకు వెంటనే కావలిసినవన్నీ సమకూరుస్తాడు.



స్వస్తి.












15 May, 2012

శ్రీవేదాద్రి అన్నయ్య శ్రీమతి కాత్యాయని వదిన 42వ వివాహ వార్షికోత్సవము

శ్రీవేదాద్రి అన్నయ్య శ్రీమతి కాత్యాయని వదిన 42వ వివాహ వార్షికోత్సవము సందర్భమున వారిద్దరి పాదములకు


నమస్కరిస్తూ కీసర వంశస్థులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము.










వారి అన్యోన్య దాంపత్యము కలకాలము వర్ధిల్లాలని ఏడుకొండల శ్రీవేంకటేశ్వరుని ప్రార్ధిస్తూన్నాము.



08 May, 2012

చి! సునీల్ కుమార్ పుట్టిన రోజు

ఈరోజు అనగా ది.8.05.2012 ఢిల్లీలో నా ద్వితీయ కుమారుడు చి! సునీల్ కుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
                                        


కీసర వంశజుల తరఫున చి! సునీల్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందచేస్తున్నాము.
 
                         http://telugugreetings.net/cgi-bin/pd/pd.cgi?object=/pd/postcards/birthday/large/abhinandanalu.swf&form=form-flash.txt
 
 
 

06 May, 2012

చి! లక్ష్మీనరసింహమూర్తి షష్ట్యబ్ధి పూర్తి మహోత్సవ విశేషములు

చి! లక్ష్మీనరసింహమూర్తి షష్టిపూర్తి వేడుకలు దమ్మాయిగూడాలోని భరద్వాజ్ నిలయంలో ది.22.04.2012 నుండి ది.24.12.2012 వరకు ఘనంగా జరిగాయి.


వేదోక్తమయిన ఈ పవిత్ర కార్యక్రమ నిర్వహణ యావత్తూ బ్రహ్మశ్రీ వేలమూరి దత్తాత్రేయశర్మగారు అత్యంత భక్తి శ్రద్ధలతో పలువురు వేదవిద్వాంసుల సహకారముతో వైభవంగా నిర్వహించారు.

మొదటిరోజు మృత్తికాస్నానానంతరము మహామంటపారాధనము వేదోక్తమంత్రములతో కలశస్తాపనలతో రంగవల్లికలతో కడు రమ్యంగా సాగినది.

మహాగణపతి పూజానంతరము, రెండవరోజు ఆయుష్యహోమము, సూర్యనమస్కారప్రక్రియ యంత్రసహితముగా జరినవి. తదుపరి ఉగ్రరధశాంతిహోమములు ఋత్విక్కులు సశాస్త్రీయముగా జరిపించి, మహావైభవముగా సహస్రలింగాభిషేకము చేశారు. చి!లక్ష్మీనరసింహమూర్తి, ధర్మపత్ని చి!భారతి ఈ వైదికప్రక్రియలన్నిటినీ మహశ్రద్ధగా చేశి, వంశాభివృద్ధికొరకు అనేక దానములు బ్రహ్మణప్రముఖలకు నిర్వహించారు.

మూడవరోజు చి!చైతన్య, చి!ప్రశాంత్ దంపతులు తల్లిదండ్రులకు పాదపూజ చేసి కృతార్ధులయ్యారు.

తదనంతరము వైదికముగా పుర్ణాహుతి జరిగినది. దంపతులకు కీసర ఆడపడచులు మంగళహారతిచ్చి, వేడుకలకు స్వస్తి పలికారు.

ఈవేడుకలకు పెద్దఎత్తున బంధుమిత్రులు హాజరయి చి.మూర్తిదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

చి.మూర్తి దంపతులు పెద్దలకు పిన్నలకు నూతనవస్త్రములందించి, షడ్రసోపేతమైన విందుభోజనములతో వారినందరిని ఆనందపరిచారు.

ఈ వేడుకలకు సంబంధించిన వేలకొలది చాయచిత్రములు మాకందినవి. వాటినన్నిటిన్నీ వీక్షీంచుటకు

ఈ లంకెను నొక్కండి.

http://www4.snapfish.in/snapfishin/thumbnailshare/AlbumID=4230078024/a=4060870018_1571475024/


సాయంత్రం జరిగిన "మేజువాణి" లో చి!జ్యోత్స్న, చి!జ్యోతి, మధురమైన అన్నమయ్య సంకీర్తనలు


శ్రావ్యంగా ఆలపించి ఆహుతులనలరించారు. తదుపరి షష్ట్యబ్ధి దంపతులు మనుమరాళ్ళ సహాయంతో 60వ సంవత్సరపు పుట్టినరోజు కేకును కట్ చేయగా అన్నదమ్ములు, చెల్లెళ్ళు, బంధుమిత్రులు "HAPPY BIRTH DAY" గీతాన్ని ఆలపించారు. పిల్లలు కేకును అందరికీ పంచగా అందరి నోళ్ళు మళ్ళీ ఆరోజు సాయంకాల వాతావరణంలా మధురధరహాసాలతో గుబాళించాయి.

ఆ కేకు కోస్తున్న సంబరం ఇక్కడ చూడండి.





మిగిలిన అన్ని వీడియోలు దాదాపు ఓ యాభై  యూట్యూబులోనికి పంపడమైనది.

ఆవీడియోలను వీక్షించటానికి ఈ క్రింద ఇవ్వబడిన లంకెలను ఉపయోగించండి.

http://www.youtube.com/playlist?list=PL8FA212C8F342A141

శ్రీసాయిఅన్నయ్య డిజిటల్ కెమేరా నుండి తీసిన 110 చాయచిత్రములు వీక్షించుటకు ఈ క్రింది లంకెను ఉపయోగించండి.

https://plus.google.com/u/0/photos?tab=mq#photos/105802903792469439891/albums/5743865105855771137


స్వస్తి.





















 

కీసర వంశము***** KEESARAVAMSAM