మా నలభైయ్యవ వివాహ వార్షికోత్సవము తిరుమలలో శ్రీవారి ముంగిట గడిపాము.
కీసర వంశము విశేష అంతర్జాలమునకు మీకు స్వాగతము. WELCOME TO WEB SITE OF KEESARAVAMSAM
22 December, 2012
శ్రీమాన్ అనంతాళ్వారు వారు తిరుమలలో స్వయముగా నిర్మించిన తటాకము
శ్రీమాన్ అనంతాళ్వారు వారు శ్రీరామానుజాచార్యులువారి అనుజ్ఞమేరకు శ్రీవారి జలకైంకర్యముకొరకు (అభిషేకము ఇత్యాదులకొరకు) తిరుమలలో ఒక తటాకము స్వయముగా నిర్మించారు. ఆ తటాకము మీరు దర్శించండి. చిన్న వీడియో లంకె మీకోసం.
http://www.divshare.com/download/21226339-ff2

తిరుమల శ్రీవారి దర్శనభాగ్య విశేషములు
తిరుమల శ్రీవారి దర్శనభాగ్య విశేషములు
తిరుమల-తిరుపతి దేవస్థానమువారి దశవర్ష స్కీములో భాగంగా పదవసారి మేము నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై అయిదు వరకు తిరుమలలో ఉన్నాము. నవంబర్ ఇరవైరెండున మా నలభైయ్యవ వివాహ వార్షికోత్సవము సందర్భమున మా చిరంజీవులు శ్ర...ీవారి వసంతోత్సవమునకు టిక్కెట్లు తీసుకున్నారు.
వైభవమంటపములో వసంతోత్సవ దర్శనము అపూర్వ అనుభవము .వైభవమంటపములో వసంతోత్సవ అనంతరము ఆరోజు గురువారము అగుటచేత శ్రీవారి నేత్రదర్శనము శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గరగా లభించినది.
నవంబర్ ఇరవై మూడు దశవర్ష స్కీములో మొదటి రోజు దశమి సుప్రభాత దర్శనములో శుక్రవారము అగుటచేత తిరిగి నేత్రదర్శన (శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి) భాగ్యము కలిగినది. దశవర్షస్కీములో భాగంగా తిరిగి వైకుంఠముద్వారా అదేరోజు మరో దర్శనము ఉండుటచేత, మళ్ళీ వైకుంఠముద్వారా వచ్చుటకు కష్టమగునని అక్కడేఉన్న ఆలయములోనున్న సూపరెండెంటువారిని, ఇక్కడనుండే శ్రీవారిని దర్శించుటకు అనుమతించమని అభ్యర్ధించాము. వారు మా స్కీములో చివరి (పదవ) సంవత్సరము అగుటచేత మా వయస్సు దృష్ట్యా వారు ఆలయద్వజస్థంభమువద్దనుండే మమ్ములను శ్రీవారి దర్శనమునకు అనుమతించినారు. అది మాపాలిటి మరియొక వరమే అయి, భగవంతుని నిజపాదదర్శనము శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గర లభించినది.
ఆ స్కీము రెండవరోజున మరియొకసారి శ్రీవారి సుప్రభాతము సేవలో ఇరవైనాలుగువ తారీఖున పాల్గొని, శ్రీకుళశేఖర్ ఆళ్వార్ పడి దగ్గర ఒక దర్శనము, మరల శీఘ్రదర్శనములో మరియొకసారి లఘుదర్శనములో శ్రీవారిని తిరిగి సేవించుకుని, శ్రీవారి శేషవస్రము, ఆడువారికిచ్చు రవికల గుడ్డ , ఇరవై లడ్డు ప్రసాదములు తీసుకుని "రామ్ బగీచా" లోని మా బసకు చేరుకొన్నాము.
ఆఖరి రోజు శ్రీ అనంతాళ్వారువారు స్వయముగా శ్రీవారి కైంకర్యముకోసము తవ్విన చెరువును దర్శించుకున్నాము. ప్రతిరోజు శ్రీవారి దీపోత్సవ అనంతరము జరుగు మాడవీధులలో జరుగు ఊరేగింపులో పాల్గొని, శ్రీవారికి నైవేద్య, హారతి కైంకర్య సేవచేసి తరించినాము.

Subscribe to:
Posts (Atom)