07 July, 2011

చి!!లక్ష్మీనరసింహమూర్తి పదవీ విరమణ

                                        
                                             చి!!లక్ష్మీనరసింహమూర్తి పదవీ విరమణ





                  చి!!లక్ష్మీనరసింహమూర్తి, ది. 31.05.2011 న కేంద్ర ప్రభుత్వ Intelligence Bureau నుండి
Sub-Inspector గా పదవీ విరమణ చేశాడు.  తమ్ముడు  చి!!లక్ష్మీనరసింహమూర్తి, అంతకు ముందు
ఇండియన్ ఆర్మీలో పదిహేను సంవత్సరములు వివిధ శాఖలలో ఉత్తరహిందూస్తానములో పలు ప్రదేశాలలో
పనిచేసి అధికారుల మన్ననలు పొందాడు.  మొత్తం దాదాపు 36 సంత్సరాలు పదవీకాలములో ఉండి
ప్రభుత్వమునుండి అనేకానేక బహుమతులు గెలుచుకున్న చి!!మూర్తి బహుముఖ ప్రజ్జాశాలి, ఉత్సాహవంతుడు.
బంధుప్రీతి, స్నేహశీలి అయిన చి!!మూర్తి తన పదవీ విరమణ సందర్భముగా సికింద్రాబాదులోని తనదమ్ముగూడ
నివాసములో, శ్రీరమాసహిత శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతము బంధుమిత్రులనందరిని ఆహ్వనించి,ఎంతో
భక్తిశ్రద్ధలతో,  ఘనంగా నిర్వహించాడు. చి!!చైతన్య  లావోస్ (నైజీరియా) లో ఉండుటవలన,  ధర్మపత్ని చి!!సౌమ్య అత్తమామలను నూతనవస్త్రములతోనూ,   చి!!ప్రశాంత్, లండన్ నుండి పుష్పగుచ్చము పంపి, తన తల్లిదండ్రులను సత్కరించారు.

   ఈవేడుకలలో విశేషంగా చెప్పుకోవలసిన విషయము చి!!హరిష్ తన బావగారి మీద కురిపించిన
   కవితామృతధారావాహిని.  చి!!హరిష్ తన బావగారిని అక్షరామృతపద్యపుష్పమాలతో సత్కరించడము
ఎంతో హృద్యంగావుండి, అందరి మన్ననలను అందుకుంది.

  ఆహ్వనితులు శ్రీరమాసహిత శ్రీసత్యనారాయణస్వామి వారి  తీర్ధ  ప్రసాదములు స్వీకరించిన పిదప
        విందుభోజనము ఆరగించి, చి!!మూర్తిని, చి!!భారతిని మరోసారి అభినందించి ఆహ్వానితులు
మధురానుభుతులతో వెనుదిరిగారు.

  
చి!!లక్ష్మీనరసింహమూర్తి పదవీ విరమణ చిత్రములు తిలకించుటకు దిగువనివ్వబడిన లింకు నొక్కండి.

https://picasaweb.google.com/106248072635947277206/CHYMURTHYRETIREMENTFUNCTIONANDVRATAM#



      

కీసర వంశము***** KEESARAVAMSAM