14 January, 2012

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


య ఏవ యత్నః క్రియతే బాహ్యార్థోపార్జనే జనైః !

స ఏవ యత్నః కర్తవ్యః పూర్వం ప్రజ్ఞావివర్ధనే  !!

(యోగ వాసిష్ఠం-ఉపశమ ప్రకరణమ్)

(భావం : బాహ్య వస్తువులను, విషయములను సంపాదించటంలో ఎంతటి ప్రయత్నం చేస్తూంటామో, అంతటి ప్రయత్నాన్నే ముందుగా మన ప్రజ్ఞను వృద్ధి చేసుకోవటంలో చేయాలి. జఠరాగ్ని సమంగా ప్రజ్వరిల్లుతున్నప్పుడే గదా పంచ భక్ష్య పరమాన్నాలను ఆస్వాదించి, ఆనందించ గలిగేది ! పిల్లలను అత్యున్నత విద్యా శాస్త్రాలలో చేర్పించేముందే, వారిలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని సమాజహిత సత్ప్రయోజనాలకొరకే వినియోగించే సద్బుద్ధిని పాదుకొల్పాలి గదా !)

ఈ మకర సంక్రాంతి  శుభ సందర్భమున,

పైన ఇచ్చినటువంటి ఆణిముత్యాలను వేలకొలది అందంగా అమర్చిన కిరీటమానమైన శ్రీమద్రామాయణ, యోగవాసిష్ఠ గ్రంథద్వయమును మన భారతజాతికి అందించిన ఆదికవి శ్రీవాల్మీకిమహర్షియొక్క దివ్యాశీస్సులు మనందరిపై వర్షించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ,

సాయి సాలగ్రామ నరసింహ శర్మ

కీసర వంశము***** KEESARAVAMSAM