04 November, 2019




                    కార్తీక శుక్ల షష్ఠి నా 72 వ జన్మదినం జరుపుకున్నాను.


               ఆనాటి నా ఫేస్బుక్ పోస్టుకు విశేషమైన స్పందన వచ్చింది.



                           ఆ రోజు నా పోస్టు


                "    జాజిశర్మా ! నీకు 72 ఏళ్ళు అంటే నమ్మరేమోరా !  


పూర్వాషాడ నక్షతం, కార్తీక శుక్ల షష్ఠి, శనివారం కలిసి వచ్చే రోజు ఈ రోజు భవదీయుని 72వ పుట్టిన రోజు

ఈ సందర్భముగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సేవ భాగ్యము మెండుగా పొంది నా విద్యుక్త ధర్మము నెరవేర్చిన సంతృప్తితో వారిని మనసారా ప్రతిరోజు తలచుకుంటూ ప్రణమిల్లుతున్నాను. పితృదేవతలకు విద్యుక్త ధర్మము శక్తిమేరకు చేయటమే పుత్రుని ధర్మం కదా !

విద్యగరపిన గురువులకు మనస్సులో పాదాభివందనములతో కృతజ్ఞతలు చెప్పుకోవటం తప్ప వారి ఋణము ఏ శిష్యుడు తీర్చుకోలేడు కదా !

నాతో కలిసి పెరిగిన ఐదుగురు సోదరులకు, ఐదుగురు అక్కచెల్లెళ్ళ ప్రేమను అమితంగా పొందిన నేను అదృష్టవంతుడననే భావిస్తున్నాను. వారితో మెలిగిన జ్ఞాపకాలే నాకు మిగిలిన మధురానుభూతులు.

ఇఖ స్నేహితులకు కొదవలేదు. అంటే నాతో చదువుకున్న వారు , ఉద్యోగములో భుజాలపై చేతులు వేసుకుని " ఏరా "అని అప్యాయంగా పిలిచే వారున్నారు. వారిని వీలున్నప్పుడెల్లా కలుస్తునే ఉన్నాను.

ఇఖ తల్లిదండ్రులు, దైవం ఇచ్చిన ఈ దేహం ఇప్పటి వరకు ఆరోగ్యం గానే ఉన్నది.

ఫేస్బుక్ మిత్రులు ఇచ్చిన ప్రొత్సాహం, వారి ఆదరణ, కొందరి విపరీతమైన అనురాగం, నా ఆరోగ్య రహస్యం. అందరికీ అనేకానేక నమస్కారములతో, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

ఈ సంతోష సమయాన్ని మీతో పంచుకోవటానికి కావలసిన పోషణాభారం, నైతిక బలాన్ని ఇచ్చిన నా ధర్మపత్నికి జేజేలు. ఆశీస్సులు. నా కొండంత బలం నా కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు అని వేరే చెప్పనఖర్లేదు కదా ! వాళ్ళ అభివృద్ధి కోసమే కదా నిత్య ఆరాధనలు.( కొంత మనకోసం అనుకోండి. )

పెద్దలు ఆశీస్సులు, పిన్నల శుభాకాంక్షలు కోరుకుంటున్న, మీ జాజిశర్మ" 


       కార్తీక శుక్ల షష్ఠి నా 72 వ జన్మదినం జరుపుకున్నాను.



            ఆ పై పోస్టుకు నా మిత్రుల స్పందన పై లింకులో  చూడవచ్చును 


               
                         

కీసర వంశము***** KEESARAVAMSAM