25 May, 2011

త్రిరత్నములు

అమ్మ సరస్వతి ప్రసునాంబకు శ్రీనాన్నగారు కీసర వేంకటరామ నరసింహారావుగారు ప్రేమతో ఇచ్చిన త్రిరత్నములు.


త్రిరత్నములు వీక్షించుటకు ఈ లింకు నొక్కండి.

http://www.archive.org/details/TRIRATNALU


లింకునొక్కితే, All Files: HTTP కి వెళ్ళి, ఇండెక్సు లోని, fathersonnets అనే ఫాంట్ కు వెళ్ళి, త్రిరత్నములు వీక్షించవచ్చును. మీ కంప్యూటర్ లోకి సేవ్ చేయవచ్చును.

పితృదేవతల సరసన చేరిన కరుణకుమారి

పితృదేవతల సరసన చేరిన కరుణకుమారి
కీ.శే.భాస్కర నరసింహ శర్మ, మాత జయప్రదల ఎకైక పుత్రిక కరుణ కుమారి ది. 11.04.2011 న ఎర్రుపాలెం లో
స్వర్గస్తురాలైనది అని తెలుపుటకు  చింతిస్తున్నాము. చిన్నన్నయ్య శ్రీ వేదాద్రి నరసింహ శర్మ కరుణకుమారి
 అంత్యక్రియలు (ఖననము) 12.04.2011 జరిపాడు. కీసర వంశస్తులందరూ ఈ ఖననమునకు  హాజరయి మాత జయప్రదకు సంతాపము తెలిపి, స్వాంతన చేకూర్చడానికి ప్రయత్నించారు. 22.04.2011 న ఎర్రుపాలెం లో నారయణబలి జరిగినది.



మేనమామ చి.విజయభాస్కర్, అతని ధర్మపత్ని చి.జయ, మాత జయప్రద కుటుంబమునకు చేయూతనిచ్చిన తీరు ఆదర్శనీయము.

బాబాయిలన్నా, అత్తయ్యలన్నా కరుణకుమారికి ప్రత్యేక అభిమానముండేది. వాళ్ళని సర్వదా స్మరిస్తూండేది. ఈజన్మలో కరుణకుమారి జన్మరాహిత్యము పొందాటానికి మాతా జయప్రద గర్భజనిత అయిందని మా భావన. పితృదేవతల సరసన చేరిన  కరుణకుమారికి ఇవే మా నమోవాకములు. కరుణకుమారిఅనే ఉపాధిలోనున్న జీవుడు శాంతిననుభవించుగాక అని ఆ సర్వాంతర్యామిని  ప్రార్ధిస్తున్నాము.

కీసర వంశము***** KEESARAVAMSAM