06 May, 2013

చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు


చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు ది. 05. 05. 2011 న  ఇంద్రప్రస్త లో అతి వైభవముగా జరిగినది.

        చిరంజీవిని తాత గారు సాయి , నాయనమ్మ జగదీశ్వరి ఉదయమే హారతి ఇచ్చి దీవెనలు పలికారు. తల్లి
తండ్రులు చి. సునీల్ కుమార్ చి.స్వప్న సుందరి ఆశ్శీ సులు ఇచ్చి మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు   ధరింపచేశారు. చిరంజీవి సౌందర్య లహరి పెద్దలందరికీ పాదాభివందనము చెసింది చిరంజీవి స్వర్ణ మంజరి ఈ వేడుకలలో ఉత్సాహముగా పాల్గొంది. వివిధ ప్రాంతముల నుండి బంధుమిత్రులు చిరంజీవి సౌందర్య లహరికి ఫోన్లలో ఆశ్శీశులు అందచేశారు. సాయంకాలము యాభై మంది పిల్లల మద్య సౌందర్య లహరి పుట్టిన రోజు " కేకు" కట్  చేసి స్నేహితులతో నృత్యగాన విభావరిలో పాల్గొని కన్నుల విందు  ఛేసినది.

                                                          

04 May, 2013

చిరంజీవి స్వప్న సుందరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు


చిరంజీవి స్వప్న సుందరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

   ఈ  రోజు జన్మదినము జరుపుకుంటున్న మా ద్వితీయ స్నుష (కోడలు) కు, కీసర వంశస్తులందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

                         


26 April, 2013

మా మాతృమూర్తి ఆబ్దీకము - చైత్రబహుళ పాడ్యమి (26.04.2013)


బ్రహ్మశ్రీ భీమసేన భట్టు గారి ఆధ్వర్యమున, మిత్రులు శ్రీ పరిటాల గోపీకృష్ణ గారి సమక్షములో మా మాతృమూర్తి ఆబ్దీకము వేదోక్తముగా జరిగినది.  

20 April, 2013

చి.హర్షిత, చి.ద్రితి

చి.చైతన్య, చి.సౌమ్యల ముద్దుబిడ్డలు విజయ నామ సంవత్సర ఉగాది పండుగ రోజున చి.హర్షిత, చి.ద్రితి

17 April, 2013

చి. శ్రీకాంత్ భరద్వాజ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు


"   చి. శ్రీకాంత్ భరద్వాజ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు "

        చి.పార్ధసారధి, చి.ఉమాదేవి సుపుత్రుడు చి. శ్రీకాంత్ భరద్వాజ్. 



            

       గుంటూరులో ఈ రోజు అనగా ది. 17వ ఏప్రియల్  2013 న    పుట్టినరోజు జరుపుకుంటున్న చి. శ్రీకాంత్ భరద్వాజ కు కీసర వంశస్తులందరూ శుభకాంక్షలు  తెలుపుతున్నారు.



     

03 April, 2013

శ్రీ నాన్నగారి ఆబ్దీకము

శ్రీ నాన్నగారి ఆబ్దీకము ది20-3-2013 ఫాల్గుణ శుద్ధ నవమి బుధవారమునాడు గుంటూరులో ని మారుతీనగర్ చి.పార్ధసారధి స్వగృహం లో శ్రీ ఆదిరాజు పూర్ణచంద్రరావు బావ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది .చి. మూర్తి , చి.రాంబాబు మరదలు శశికుమారి తన కోడలు మనమరాలు ని తీసుకొని వచ్చారు . చి.బిందుకొడుకు సాయి కూడా వచ్చాడు. చి.భాస్కర్ నందిగామనుంది బావగారిని ప్రత్యేకముగా కారు లో తీసుకువచ్చాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ రామచంద్రరావు దంపతులు ఆ కారులోనే వచ్చారు . ఆబ్దీకము తర్వాత రామచంద్రరరావు దంపతులను చి.పార్ధసారధి మనమరాళ్ళు చి. అఖిల చి. నిఖిలలు పూలదండలతో సత్కరించారు . తరవాత చి.పార్ధసారధి, భార్య చి.. ఉమాదేవి కలిసి శ్రీ రామచంద్రరావు దంపతులని నూతన వస్త్రాలతో సత్కరించారు . ఆనాటి సభలో చి. మూర్తి శ్రీ బావగారు , చి. రాంబాబు ముఖ్య అతిధి శ్రీ రామచాద్రరావు లు శ్రీ నాన్నగారి గురించి చక్కగా మాట్లాడారు . అందరు శ్రీ రామచంద్రరావు సేవలు ప్రస్తుతించి, అతను మనలో యొక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయడని అతనిని ఈ సందర్భముగా శ్రీ నాన్నగారి తరఫున సత్కరించడం చాల మంచి విషయమని దానికి శ్రీ రామచంద్రరావు అర్హుడని అందరు తమ ఉపన్యాసములలో చెప్పారు .


చి.పార్ధసారధి కుమార్తె చి. సుశీల స్వప్న అల్లుడు మనమరాళ్ళు ఈ కార్యక్రమ నిర్వహణ భాద్యత చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చాయాచిత్రములు ఇక్కడ చూడండి.








26 March, 2013

కాశీ, గయా యాత్రలు - నందన ఫాల్గుణం - మార్చి 2013

కాశీ, గయా యాత్రలు - నందన ఫాల్గుణం - మార్చి 2013


నేను, నా ధర్మపత్ని చి.జగదీశ్వరి 18 వ మార్చిన బయలుదేరి మరునాడు ఉదయము కాశీ చేరుకున్నాము. బస జయపూరియ హోటల్. అసి, కేదార్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్, లలో పుణ్యస్నానములు ఆచరించి, సరిగ్గా అపర్నాహము అగుసరికి మణికర్ణికా ఘాట్ లో రామేశ్వరము నుండి తెచ్చిన జలములతో సహా సైకతలింగమునకు అర్చన చేసుకొని, సైకతలింగము సమంత్రకముగా పవిత్ర గంగాజలములలో నిమజ్జనము గావించాము.

తదుపరి శ్రీకాశీవిశ్వనాధుని దర్శనము చేసుకుని శ్రీస్వామికి క్షీరాభిషేకముతో అర్చన చేసుకున్నాము.

కాశీఅన్నపూర్ణను సేవించుకుని, సాక్షిగణపతి స్వామికి కైమోడ్పులొనరించి., బస చేరుకుని సాయంకాలము గయ ప్రయాణము అయ్యాము.

ఫాల్గుణ శుద్ధనవమి - మా నాన్నగారి తిధి

గయ మేము బుధవారము ఫాల్గుణశుద్ధనవమి 20 వ మార్చి తెల్లవారుఝామున మూడుగంటలకు చేరుకున్నాము. ముందు అనుకున్నప్రకారము స్థానిక తెలుగు పురోహితులు శ్రీఅరుణాచారి గారు తమ మనిషిని రైల్వేస్టేషన్ కి పంపారు. అతని సహాయముతో మేము బసకు చేరుకుని రెండుగంటలు విశ్రాంతి తీసుకుని, తరువాత సంధ్యాదులు ముగించి, అపర్ణాహ వేళకు మాకు నిర్ణయించబడిన గదిలో ఆరోజు కీ.శే.మానాన్నగారి తిధి అగుటచేత, వారికి శ్రాద్ధకర్మ నిర్వహణకు ఉపక్రమించాను. ఆ యజ్ఞము శ్రీకుప్పా ఆంజనేయ శర్మ గారు నిర్వహించారు. అగ్నిహోత్రము, భొక్తలు, నాలుగు కూరలు, నాలుగు పచ్చడులు, నాలుగు పిండివంటలు, భోక్తలకు సన్మానమునకు ధోవతులు, అంగవస్త్రములు, రాగిచెంబు, హరివేణము, పంచపాత్ర, ఉద్ధరిణ, ఋత్విజునకు సన్మానమునకు విడిగా వస్తుసామాగ్రి నిమిత్తము దక్షిణతాంబూలాదులతో శ్రాద్ధకర్మ సమంత్రకముగా యధావిధిగా నిర్వహించి శ్రీనాన్నగారికి నేను చేయవలసిన ఈ యజ్ఞకర్మ నిర్వహించి సంతుష్టిచెందినాను. ఈ యజ్ఞకర్మకు నా ధర్మపత్ని తనవంతు కార్యము నిర్వహించినది. పార్వణములు పవిత్ర విష్ణుపాదముల వద్ద తాడనము చేసి పాదములకు అర్పణము మరొక ముఖ్య కార్యక్రమము. దాదాపు రెండున్నర గంటలు పట్టిన ఈ శ్రాద్ధకర్మ అనంతరము పితృదేవతల ప్రసాదము స్వీకరించి విశ్రాంతి తీసుకున్నాము.





అష్టాదశ శక్తి పీఠము - మాంగల్య గౌరి దర్శనము - గయ

సాయంకాలము అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన మాంగల్య గౌరి దర్శనము చేసుకున్నాము. ఈ మాత ఆలయము చాలా ప్రశస్తమైనది.

చిన్న ఆలయమైన చాలా మహిమాన్వితమైనదిగా భారతదేశములో ప్రసిద్ధి చెందినది. అమ్మ గర్బాలయము ప్రవేశము చాలా ఇరుకుగా ఉన్నది. గర్భాలయములో ముగ్గురు నలుగురుకు మాత్రమే కూర్చొను స్థలము కలదు. మళ్ళీ ఆ సన్నటి ప్రవేశద్వారము ద్వారా నిర్గమనము వయసుమీరిన వారికి కొద్ది శ్రమగా ఉండగలదు. ప్రక్కనే దుర్గామాత ఆలయము దర్శనము చేసుకొని బసకు తిరిగివచ్చాము.

పితృదేవతలకు "గయాశ్రాద్ధము"

మరుసటి దినము యధావిధిగా పితృదేవతలకు గయాశ్రాద్ధము నిర్వహించడమైనది. ఇది ప్రతి గృహస్తు విధిగా నిర్వహించవలసిన కార్యక్రమము. గయలో పితృదేవతలకు అంటే పితామహుల, మాతామహుల వైపున గతించిన బంధువులకు, స్నేహితులకు, గురువులకు పిండప్రదానము చేసి మనవంతు ధర్మము నిర్వహించుట ప్రధాన ఉద్దేశ్యము. ఇది గయలో చాలమంది తెలుగువారు నిర్వర్తించడము చాలా ముదావహం. ఈ కార్యక్రమము యావత్తూ "విష్ణుపాదముల" ఆలయప్రాంగణములో జరిగినది. మూడు విశాలపత్రములలో ఒక్కొక్క పత్రములో ముప్పైరెండు చొప్పున మొత్తం తొంభైయ్యారు పిండములు తయారు చేసి, సమంత్రకముగా పితృదేవతలకు పిండప్రదానము చేసి, ఆ పార్వణములు విష్ణుపాదములవద్ద అర్పణగావించి, తిరిగి ముప్పై రెండు పార్వణములు గోమాతకు అర్పణముచేసి, చివరి ముప్పైరెండు పార్వణములు పవిత్ర అక్షయవటవృక్షమునకు అర్పించి కృతార్ధుడయ్యాను.






తదుపరి కర్త, అతని ధర్మపత్ని మూడువిధిగా త్యజించవలసినవి త్యజించాము. ( ఓఆకు, ఓకూర, ఓ పండు త్యజించవలసినవి.) అసలు త్యజించవలసినవి అరిషడ్వర్గములు అని పెద్దలు చెబుతారు. సామాన్యులకు అది సాధ్యం కాదు కాబట్టి, ఇష్టమైనవి త్యజించడము అలవాటు చేసుకోవాలి అని భావన.

తిరిగి బసకు చేరుకుని బుద్ధగయ చారిత్రాత్మకము కాబట్టి అది కూడా దర్శనీయ స్థలములో భాగముగా చూచివచ్చాము.






మరునాడు తెల్లవారు ఝామున కాశీప్రయాణమై, మూడురోజులు కాశీవాసము చేసి, శ్రీవిశ్వనాధుణ్ణి, హొలీపున్నమి ముందువచ్చే ఏకాదశిసాయంసమయమున భక్తులు శ్రీస్వామి వారికి రంగులు అర్పించడము ఆనవాయితీ. శ్రీస్వామి దర్శనార్ధము వెళ్ళిన ఇది మాకు అనుకోకుండా కలిగిన మహాధ్భాగ్యము. శ్రీస్వామివారిని అత్యంత రంగురంగులతో అలంకరించి భక్తులకు కనువిందు గావించారు. అమ్మవిశాలాక్షిని, కేదారేశ్వరుణ్ణి, లోలార్కకుండ ఆదిత్యులను, శంకరమఠస్వాములను , ఇతర ఆలయములు దర్శించుకుని ఇంద్రప్రస్త తిరుగుప్రయాణము అయ్యాము. మా కాశీ, గయ తీర్ధయాత్రలు ఈ విధంగా సుసంపన్నము అయినవి. స్వస్తి.

మరిన్ని ఛాయాచిత్రములకు క్రింది లంకె నొక్కండి.

https://plus.google.com/u/0/photos?tab=Xq#photos/105802903792469439891/albums/5859561756970103873



08 March, 2013

చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి నాగశ్రీవల్లీ పన్నెండవ వివాహ వార్షికోత్సవము



  చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి  నాగశ్రీవల్లీ   ఈ రోజు అనగా ది. 8 వ మార్చి న పూనా నగరం లో   తమ పన్నెండవ  వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్నారు.  వారిద్దరికీ కీసర వంశస్థులందరు శుభాకాంక్షలు  అందచేస్తున్నారు .


                                                                    

06 March, 2013

పవిత్ర మహాకుంభమేళా - నందన మాఘము 2013

పవిత్ర మహాకుంభమేళా సందర్భమున నేను త్రివేణి సంగమమున ప్రితృదేవతలకు
యధావిధిగా కర్మలను ఆచరించి వచ్చాను. ఈ యజ్ఞములో నా ధర్మపత్ని జగదీశ్వరి తనవంతు ధర్మములు నెరవేర్చటముతో పాటు, "వేణీదానము" కూడా చేసి కార్యక్రమము సుసంపన్నము చేసినది. ఈ కార్యక్రమము యావత్తు శ్రీ మనోహర్ శాస్త్రి పురాణిక్ గారి ఆధ్వర్యములో జరిగినది. వారు ఈ మహాకుంభమేళా స్నానము, తదుపరి కార్యక్రమములకు పితృదేవతల ఆశ్శీసులతో పాటు భగవంతుని అనుగ్రహము ఉండవలెనని తమ ఆశ్శీపూర్వకవాచకములో చెప్పారు.

ఈ యాత్రలో భాగంగా అష్టాదశపీఠములలో ఒకటైన "శ్రీమాధవేశ్వరీమాత" "ఆలోపీ మహేశ్వరీ" పీఠదర్శనము, మహావటవృక్షము, హనుమాన్ దేవాలయము, శంకరవిమాన మండపము, భారద్వాజ ఆశ్రమము చూడటం మా భాగ్యంగా తలుస్తున్నాము.

దీనికి సంబంధించిన ఛాయాచిత్రములు చూచుటకు ఈ లంకె నొక్కండి.

https://plus.google.com/photos/105802903792469439891/albums/5852153727535228145?authkey=CLq9__WQxMSN1gE#photos/105802903792469439891/albums/5852153727535228145

శ్రీకృష్ణార్పమస్తు.

వేణీదానము

మా త్రివేణీ సంగమ (ప్రయాగ) యాత్రలో చిరంజీవి    జగదీశ్వరి  "వేణీదానము" చేసినది.


దానిలో భాగంగా పతి ధర్మపత్నికి దానమునకు ముందు "వేణి" కూర్చుతున్న దృశ్యము.



                  

26 February, 2013

చిరంజీవి సునీల్ కుమార్


 ప్రస్తుతము పనిచేస్తున్న కంపెనీలో సమర్దవంతముగా ఒక దశాబ్ధము పూర్తిచేసిన సందర్భముగా చిరంజీవి సునీల్ కుమార్ ను అధికారులు ట్రోఫీలతో, సర్టిఫికేట్ లతో  సత్కరించారు.  ఆ పురస్కారములు మన ఆనందము కోసము ఇక్కడ పొందుపరుస్తున్నాము.




      

చిరంజీవి హర్షిత ఇటీవలి ఛాయా చిత్రములు


చిరంజీవి హర్షిత, చి.చైతన్య - చి.సౌమ్య ల జ్యేష్ట పుత్రిక  ఇటీవలి ఛాయా చిత్రములు చి.చైతన్య పంపిచాడు  .

      ఆ ఫోటోలు మన ఆనందం కోసము పొందుపరుస్తున్నాము.


22 February, 2013

చి.లక్ష్మీనరసింహ మూర్తి - పవిత్ర పూర్ణకుంభమేళా - ప్రయాగ 2013

"పవిత్ర పూర్ణకుంభమేళా" - ప్రయాగ 2013

చి.లక్ష్మీనరసింహ మూర్తి, ఇటీవల పవిత్ర పూర్ణ కుంభమేళా "ప్రయాగ" (అలహాబాద్) కు వెళ్ళి వచ్చి, పవిత్ర స్నానములు ఆచరించి వచ్చాడు. ఆ సంధర్భముగా పితృదేవతలకు పిండప్రదానములు ఒనరించి తన విద్యుక్త ధర్మము పూర్తిచేసివచ్చాడు. ఆ ఛాయాచిత్రములు మనందరి వీక్షణకు చి.చైతన్య పంపించాడు. చూచి ఆనందించండి.  చాయాచిత్రములు చూచుటకు ఈ లంకె నొక్కండి


https://plus.google.com/photos/105802903792469439891/albums/5849254546635019969?authkey=CPeToqiXpt64Gw

10 February, 2013

చి మహాన్యాస్ 2030 ఫిఫా వరల్డ్ కప్ ప్రిపరేషన్


చి మహాన్యాస్ పూనాలో ప్రతిష్టాత్మకమైన  "పూనా యునైటెడ్ " ఫుట్బాల్  అకాడమీలో చేరి

ఫుట్బాల్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. చి మహాన్యాస్ చి.భరద్వాజ్ ,చి .నాగశ్రివళ్లీ ల ప్రధమ పుత్రుడు.


ప్రస్తుతము  చి .మహాన్యాస్ "బ్లాక్ వీరులు " (BLACK NIGHTS)  టిముకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

చి మహాన్యాస్ ఛాయాచిత్రములో కుడి నుండి మొదటి బాలుడు.




చి మహాన్యాస్ కు ఆశ్శీసులు. మనం అందరమూ 2030 లో వరల్డ్ కప్ లో చి.మహాన్యాస్ పాల్గొనాలని ఆశిద్దాము.

















చిరంజీవి సహిష్ణు రిలే రన్నింగ్ రేసులో ద్వితీయ స్థానము


చిరంజీవి సహిష్ణు, చి .భరద్వాజ్ ,శ్రీవల్లి  ద్వితీయ పుత్రుడు పూనాలో తన క్లాసులో రిలే రన్నింగ్ రేసులో

ద్వితీయ స్థానములో వచ్చాడు.  నలుగురున్న ఆ రిలే లో  చి .సహిష్ణు  చాలా వేగముగా పరుగెత్తి

తన జట్టును  చాలా ముందుకు తీసుకెళ్ళాడని , తొలి వార్తలు తెలిపాయి.

కాని, జట్టులో మిగతా సభ్యులు చి .సహిష్ణు అందించిన "లీడ్ " నిలుపుకోలేక పోయి, ద్వితీయ స్థానములోకి

జారిపోయారని  తాజా సమాచారము.








చి సహిష్ణు కు మా ఆశ్శీసులు . జేజేలు.  ముందుముందు ఇంకా ఇలాంటి విజయాలెన్నో అందుకోవాలని

"కీసర వంశస్తులు అందరు కోరుకుంటున్నారు.





21 January, 2013

చిరంజీవి ప్రణతి : చి.రాంబాబు మనుమరాలు



   చిరంజీవి ప్రణతి చాయచిత్రము కొద్ది రోజుల క్రిత్రం మాకు అందినది.





   చిరంజీవి నరసింహారావు, చి.జ్యోతి ల ప్రధమ పుత్రిక. చి.రాంబాబు, చి.శశికుమారిల మనుమరాలు

   అందరికి మా ఆశీస్సులు.

04 January, 2013

ధనుర్మాసము -- మా దుర్గక్కయ్య - గొబ్బెమ్మలు




గొబ్బెమ్మలు - ధనుర్మాసము -- మా దుర్గక్కయ్య


మా ఇంట్లో ధనుర్మాసము ప్రారంభము రోజునుండి గొబ్బెమ్మలు పెట్టే ఆచారము ఉన్నది. మేము ఆరుగురు అన్నదమ్ములము, అయిదుగురు అక్కచెల్లెళ్ళు. ఆడపిల్లలలో పెద్దది హేమలత అక్కయ్య.


పెళ్ళయి అత్తవారింటికి నేను పుట్టకమునుపే వెళ్ళినందున, గొబ్బెమ్మెలు , మా రెండో అక్కయ్య "కనకదుర్గ" పెట్టటమే నాకు జ్ఞాపకం. ఆరోజుల్లో మేము విజయవాడ గవర్నరుపేటలోని రహమాన్ పార్క్ దగ్గర ఉండేవాళ్ళము. మా ఇంటికి ఓ రెండువందల గజాల దూరములో "శ్రీగడ్డమణుగు రాఘవరావు" అనే మా నాన్నగారి తోటి వకీలు గారు ఉండేవారు. వారింట్లో ఆవులు చాలా ఉండేవి. వారికి ఇంటికి ఎదురుగా ఆవులకోసము వేరే "కొష్టము" ఉండేది. శ్రీ రాఘవరావుగారింటి దగ్గరున్న ఆ ఆవుల కొష్టము దగ్గరకు ఆ ప్రాంతము ఆడపిల్లలు అందరూ తెల్లవారు ఝాముననే "ఆవుపేడ" కోసము జట్లు జట్లుగా వచ్చేవారు. దాదాపు ఓ అరవై మంది పైగా వరుసగా నిలబడి శ్రీరాఘవారావుగారింట్లో ఆడవారు ఇచ్చే "ఆవుపేడ" ముద్దలను ఆనందంగా స్వీకరించేవారు. ( ఈ ఆనందంగా అనే మాట మా అక్కయ్య తరువాతి కాలములో చెపితే విన్నాను) నాకు అప్పుడు మహా ఉంటే ఓ ఆరు ఏళ్ళు ఉండవచ్చును. అక్కయ్య ఉదయాన్నే నన్ను మా అన్నయ్యను ( తనతరువాతి మగపిల్లాడు) లేపి వెంటబెట్టుకుని వెళ్ళేది. అలా అక్కయ్య వెంట "ఆవుపేడ" కోసము వెళ్ళటం మాకు ఎంతో సంతోషము, గర్వంగా ఉండేది. అక్కయ్య మమ్మల్ని తీసుకెళ్ళేది "ఆవుపేడ" ముద్దల్ని మోసుకురావటము కోసము. అందరు ఆడపిల్లలు "క్యూ"లో ఉంటే, తను ఆచివరనుండి, ఈచివరదాక తిరుగుతూ అందరితో కబుర్లు చెపుతూండేది. ఆవిడ బదులు మా అన్నయ్య "క్యూ"లో ఉండేవాడు.

నేను ఆవిడ వెంట తిరుగుతూ ఉండేవాడిని. ఆడపిల్లలు అందరూ "ఆవుపేడ" వాళ్ళే మోసుకొస్తూంటే, మా "దుర్గక్కయ్య" మాత్రం "మహారాణి" లా వాళ్ళ పక్కన ఠీవిగా నడుస్తూ వచ్చేది. వాళ్ళతో పాటే మా అక్కయ్య దగ్గరుండి మాచేతిలో పెట్టించిన "ఆవుపేడ" ముద్దలు మోసుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళము. "అదేమిటే దుర్గా! గోమయము నువ్వుతీసుకోకుండా, వాళ్ళచేతిలో పెట్టిస్తున్నావేమిటీ" అని వాళ్ళుప్రశ్నిస్తే, "గొబ్బెమ్మలకు పూజచేసి మేము పుణ్యం సంపాయించుకుంటున్నాము. మరి వాళ్ళకి ఎట్లా? అందుకని వాళ్ళని పొద్దునే లేపి ఇలా మోయిస్తున్నాను." అనేదిట. బహుశ: మాతల్లిదండ్రుల పుణ్యముతో పాటు, ఈ "ఆపుపేడ" మోసే పుణ్యము కూడా మా దుర్గక్కయ్య ద్వారా వచ్చుంటుంది. అందుకనే మేమంతా హాయిగా ఉన్నాము. ఇప్పుడు ఆవిడ లేదు. ఆవిడ స్మృతులు ప్రతి గొబ్బెమ్మలో కనపడతాయి. "ఇంద్రప్రస్తలో గుమ్మాలముందు ఆ కళ లేదు." బహుశ: హైదరాబాద్ లో కూడా చాలా తక్కువ ప్రాంతాలలో కనబడుతుంది.

గొబ్బెమ్మల పాటలలొ ఆడపిల్లలు " సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణివ్వావే! తామరపూవంటి తమ్ముణ్ణివ్వావే! మొగలిపూవంటి మెగుణ్ణివ్వావే" అంటూ ప్రార్ధిస్తారు. ఈ సంప్రదాయ పద్దతులు తల్లిదండ్రులు పిల్లలకు మళ్ళీ నేర్పాలి.

25 December, 2012

శ్రీ పద్మావతి అమ్మవారి కరుణా విశేషము




శ్రీపద్మావతి అమ్మవారి ఆలయములో దద్ద్యోజనము ప్రసాదము స్వీకరించి, ఆఫీసు చేరువలో నేను శ్రీ వేంకటేశ్వర సహస్రనామావాళి పారాయణము, నా ధర్మపత్ని శ్రీలక్ష్మీసహస్రనామ పారాయణము చేసుకొనుచుండగా, అన్నపరమాణ్ణము ప్రసాదముగా పంచుతున్నప్పుడు, నా ధర్మపత్ని "వెళ్ళి అన్నపరమాణ్ణము తీసుకుందాం" అన్నది. అయితే, నా పారాయణము సంగంలో ఉన్నందున "తరువాత తీసుకుందాం" అన్నాను. ఆవిడ "సరే"నని కూర్చుంది. నా పారాయణ ముగించుకుని ప్రసాదము తీసుకుందామనుకునే సరికి ప్రసాదము కౌంటర్ మూసేసి వెళ్ళిపోయారు. మేము నిరుత్సాహముతో "శ్రీనివాసము" తిరిగి వచ్చాము. శ్రీనివాసము లిఫ్టు దగ్గర ఓ ముత్తైదువ వచ్చి "తిరుచానూరు ప్రసాదము" అని మా ఇద్దరికి అదే ప్రసాదము ఇవ్వటం శ్రీపద్మావతి అమ్మవారి కటాక్షముగా భావిస్తున్నాము.  

కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.

కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.


నవంబర్ ఇరవై ఆరున కార్తీక సోమవారము అయింది. శ్రీకాళీహస్తీశ్వర ,జ్ఞానప్రసూనంబల దర్శనార్ధము మేము శ్రీకాళహస్తి ఉదయము ఎనిమిది గంటలకు చేరుకున్నాము. భక్తజనసందోహముతో, శ్రీకాళహస్తి కిటకిటలాడ...ుతోంది. శ్రీస్వామివారిని పవిత్ర కార్తీక సోమవారమునాడు దర్శించుకొనుటకు, భక్తులు బారులుతీర్చి నిల్చున్నారు. పాతాళ గణేశుని దర్శించుటకొరకే దాదాపు ఓ వెయ్యిమంది భక్తులు "క్యూ"లో ఉన్నారు. ఆ గణేశుని బయటనుండే ప్రార్ధించుకుని, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొనుటకు "క్యూ" లో నిల్చుని, ఓ రెండుగంటల అనంతరము ప్రధాన ఆలయప్రాంగణములో ప్రవేశించాము. ఆ తరువాత శ్రీశ్రీకాళహస్తీశ్వరుని దర్శనము అనూహ్యముగా ఓ అరగంటలో సంతృప్తిగా జరిగినది.

ఆ ఆలయములో ఉత్సవమూర్తులకు అర్చన గావించుకుని, "సౌవర్ణాంబరదారిణి" అయిన శ్రీజ్ఞానప్రసూనాంబ అమ్మవారిని సేవించుకున్నాము. పిదప శ్రీదక్షిణామూర్తి స్వామివారి చెంత ధర్మపత్ని సమయాభావమువలన "ఆనందలహరి" మాత్రమే పారాయణ చేసుకున్నది. ఆలయ ప్రాంగణములో వివిధదేవతామూర్తులకు వందనములిడి, మొదటిసారిగా సువర్ణముఖి నదిలో జలకళ చూసి పవిత్ర నదీజలాలను శిరస్సున ప్రోక్షణ గావించుకుని, శ్రీసూర్యనారాయణమూర్తికి అర్ఘ్యములిడి, సంతృప్తితో తిరిగి శ్రీనివాసము చేరుకుని సామాను తీసుకుని ఉదయం రిజర్వుచేసుకున్న మన ఆర్టీసీ బస్సులో రాత్రి ఎనిమిది గంటలకు చిదంబరం వైపుగా తరలివెళ్ళాము.

Photo: కార్తీక సోమవారము - శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనంబ దర్శనము.
నవంబర్ ఇరవై ఆరున కార్తీక సోమవారము అయింది. శ్రీకాళీహస్తీశ్వర ,జ్ఞానప్రసూనంబల దర్శనార్ధము మేము శ్రీకాళహస్తి ఉదయము ఎనిమిది గంటలకు చేరుకున్నాము. భక్తజనసందోహముతో, శ్రీకాళహస్తి కిటకిటలాడుతోంది. శ్రీస్వామివారిని పవిత్ర కార్తీక సోమవారమునాడు దర్శించుకొనుటకు, భక్తులు బారులుతీర్చి నిల్చున్నారు. పాతాళ గణేశుని దర్శించుటకొరకే దాదాపు ఓ వెయ్యిమంది భక్తులు "క్యూ"లో ఉన్నారు. ఆ గణేశుని బయటనుండే ప్రార్ధించుకుని, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొనుటకు "క్యూ" లో నిల్చుని, ఓ రెండుగంటల అనంతరము ప్రధాన ఆలయప్రాంగణములో ప్రవేశించాము. ఆ తరువాత శ్రీశ్రీకాళహస్తీశ్వరుని దర్శనము అనూహ్యముగా ఓ అరగంటలో సంతృప్తిగా జరిగినది. 
ఆ ఆలయములో ఉత్సవమూర్తులకు అర్చన గావించుకుని, "సౌవర్ణాంబరదారిణి" అయిన  శ్రీజ్ఞానప్రసూనాంబ అమ్మవారిని  సేవించుకున్నాము. పిదప శ్రీదక్షిణామూర్తి స్వామివారి చెంత ధర్మపత్ని సమయాభావమువలన "ఆనందలహరి" మాత్రమే పారాయణ చేసుకున్నది.  ఆలయ ప్రాంగణములో వివిధదేవతామూర్తులకు వందనములిడి, మొదటిసారిగా సువర్ణముఖి నదిలో జలకళ చూసి పవిత్ర నదీజలాలను శిరస్సున ప్రోక్షణ గావించుకుని, శ్రీసూర్యనారాయణమూర్తికి అర్ఘ్యములిడి, సంతృప్తితో తిరిగి శ్రీనివాసము చేరుకుని సామాను తీసుకుని ఉదయం రిజర్వుచేసుకున్న మన ఆర్టీసీ బస్సులో రాత్రి ఎనిమిది గంటలకు  చిదంబరం వైపుగా తరలివెళ్ళాము.

కీసర వంశము***** KEESARAVAMSAM