చిరంజీవి సునీల్ కుమార్ తన జన్మదినము ది.7వ మే 2018 నాడు అమెస్టర్డాం లో
తన భార్యా, పిల్లలతో కలిసి వైభవంగా జరుపుకున్నాడు.
ఆ సందర్భముగా ఫేస్బుక్లో నా పోస్టుకు మిత్రులందరూ తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు
విశేషంగా అందించారు.
ఆ పోస్టు ఇక్కడ చూడవచ్చు.
చిరంజీవి సునీల్ కుమార్ జన్మదినము శ్రీ పద్మావతి అలిమేలు సమేత ఆ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి చి.సునీల్ కుమార్ ను ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు.
శ్రీ పద్మావతి అలిమేలు సమేత ఆ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి చి.సౌందర్య లహరిని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు.
శ్రీ పద్మావతి అలిమేలు సమేత ఆ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి చి.స్వప్న సుందరి ని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు.
చిరంజీవి భరద్వాజ్ కుమార్, చిరంజీవి నాగశ్రీవల్లి ల వివాహ వార్షికోత్సవము 17వది 8వ మార్చి న పూనాలో జరుపుకున్నారు
ఆ సందర్భంగా నా ఫేస్బుక్ మిత్రుల స్పందన ఇక్కడ చూడవచ్చు.
శ్రీ పద్మావతి అలిమేలు సమేత ఆ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ రాజ్యలక్ష్మి సమేత వేదాద్రి నరసింహ స్వామి ఈ దంపతులను ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, వంశాభివృద్దిగాను, కీసర వంశజులు దీవిస్తున్నారు.
శ్రీ కీసర వేంకట రామ నరసింహారావు, శ్రీమతి సరస్వతీ ప్రసునాంబల ద్వితీయ పుత్రుడు
శ్రీ వేదాద్రి నరసింహ శర్మ (71) ఈ రోజు అనగా శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ
బహుళ తదియ నాడు తెల్లవారుఝామున 3.30 లకు సరియగు 2017 వ సంవత్సరం ఆగస్టు
తొమ్మిదివ తారీఖు (9.08.2017) తుదిశ్వాస విడిచారు.
కుటుంబ పెద్దను కోల్పోయాము.
అందరికీ ప్రేమాస్పదుడయిన అన్నయ్య పెనుగంచి ప్రోలు పట్టణములోనే గాకా, ఆ మండలము మొత్తం " శ్రీ వేదాద్రి గురుస్వామి " గా ప్రఖ్యాతి గాంచాడు. అన్నయ్య అంత్యక్రియలు బంధు,మిత్రుల సమక్షములో, వారి అయ్యప్ప శిష్య గణం మధ్య అన్నయ్య ఎకైక పుత్రుడు చి.వంశీకృష్ణ నిర్వహించాడు. అంత్యక్రియలు ఈ సాయంకాలం జరిగినవి.
ఆన్నయ్య ఏకైక పుత్రుడు చి.వంశీకృష్ణ కు అనేక అధికార, అనధికార ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.
శ్రీ వేదాద్రి అన్నయ్య బౌతికంగా మనలను వీడినా మన హృదయాలలో "శ్రీ వేదాద్రి గురుస్వామి " గా నిలచిపోతారు.