31 August, 2020

 


          చిరంజీవి భరద్వాజ్ కుమార్ పుట్టినరోజు 28 వ ఆగస్టు 2020 నా పునాలో జరిగినది. 


         ఆ సందర్భంగా నేను ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు వచ్చిన స్పందనలు 

            ఇక్కడ చూడవచ్చు. 


                      https://www.facebook.com/photo.php?fbid=3031165750346302&set=a.334305780032326&type=3&theater


                    


 

23 June, 2020

చి.ల.సౌ.నాగ శ్రీవల్లి జన్మదినం

 

చి.ల.సౌ.నాగ శ్రీవల్లి జన్మదినం  20.06.20 నాడు పునాలో జరుపుకున్నాము. 

       ఆ సంధర్భముగా నేను ఫెస్బూక్ లో పెట్టిన పోస్టు కు వచ్చిన                  అభినందనలు , ఆశీస్సులు ఇక్కడ చూడవచ్చును . 




                      

29 May, 2020

చి.స్వర్ణమంజరి జన్మదినము 28.05.2020



         చి.స్వర్ణమంజరి జన్మదినము 28.05.2020 న నా మిత్రుల స్పందన


               
                        చి.స్వర్ణమంజరి జన్మదినము 28.05.2020

06 May, 2020

చి.సౌందర్యలహరి పుట్టిన రోజు



 చి.సౌందర్యలహరి పుట్టిన రోజున (ది. 5.5.2020 ) ఫేస్బుక్లో నా మిత్రుల స్పందన


                          చి.సౌందర్యలహరి పుట్టిన రోజు

05 May, 2020

చి.స్వప్న సుందరి జన్మదినము 4వ మే 2020 ఫేస్బుక్ మిత్రుల స్పందన



 నిన్న( అనగా 4వ మే 2020 న )రోజు AMSTERDAM ( HOLLAND) లో తన పుట్టిన రోజు జరుపుకుంటున్న మా కనిష్ట పుత్రవధు చి.స్వప్న సుందరిని దీవించిన  పెద్దలైన నా మిత్రుల  స్పందన — with Swapna Sundari.

              ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడకు వెళ్ళవచ్చు

                             జన్మదినము




                     

23 March, 2020

అంతర్ముఖ సమారాధ్య



   


అంతర్ముఖ సమారాధ్య

"అంతర్ముఖ సమారాధ్య" అని శ్రీ లలితా సహస్ర నామం లో ఒక నామం . అలా ఎలా సాధ్యమో, ఎలా సాధించాలో చెప్పగలరా? ఒక మిత్రురాలు అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానము  చాలా విస్తృతముగా చెప్పవలసి వస్తుంది. అంతవ్రాస్తే, గురుద్రోహము చేసినవాడిని అవుతాను.
కానీ గురువులు మనలను ఎంతవరకు చెప్పమన్నారో అంతే చెప్పి ముగిస్తే, ఉభయతారకముగా ఉంటుందని, గురువులను స్మరిస్తూ ఆరంభిస్తాను. శ్రీ గురుభ్యోనమ:

ఇది శ్రీ లలితా సహస్రనామములోని అతి గోప్యమైన మంత్రవిభాగము. శ్రీవిద్యా ఉపాసకులు దీనిని శ్రీచక్రపూజ అనడము కద్దు.
మన మనస్సు బాహ్య విషయాలలో పడి విక్షేపాలకు లోనయ్యి విచక్షణా జ్ఞానము కోల్పోయి మనలను అధోగతి పాలు చేస్తున్నది అని కాస్త సాధన చేసినవారికి తెలుస్తునే ఉంటుంది.
కాబట్టి మనస్సుని అదుపులోనికి తెచ్చుకుని అహంకారమును జయించి సద్భుద్ధితో సాధన చెయ్యమని భగవానుడు భగవద్గీతలో మనకు బోధించాడు.
మనస్సు తామస, రాజసిక విషయములలోనికి పోకుండా సాత్విక విషయాస్తితో సాధనాక్రమములో సాధకుడు అభివృద్ది చెందాలంటే పంచేద్రియాలకు సాత్వికాహారాన్ని అందించాలని చాంద్యొగ్యము చెపుతోంది. అలా స్వాతిక దిశగా మారిన మనస్సు మీరు ఎలా వంచుతే అలావంగుతుంది. (అంటే సద్భుద్దితో గూడిన మీరు). అప్పుడు ఆ సాత్వికదశ కూడా దాటి శుద్దసాత్వికము పొందిన మనస్సు ఆత్మలో లీనమవుటయే మోక్షము. అది తురీయావస్థ అని జ్ఞానుల అనుభవము తెలుపుతోంది.

అయితే మనస్సును  సాత్వికదశకు ఏలా మళ్ళించాలో కాస్త  చెప్పుకుందాము.

మనస్సు మనం తినే ఆహారం ద్వారా పనిచేస్తోందని "చాందోగ్య ఉపనిషత్ " చెపుతోంది.
కంటి ఆహారము చూసే చూపులు, చెవులకు ఆహారం శ్రవణం, చర్మానికి స్పర్శ, జిహ్వకు తినే పదార్ధములు, ముక్కుకు ఆహారము మనము పీల్చే గాలులు.  ఈ ఇంద్రియాలకు ఇచ్చే ఆహరము సాత్వికము గా ఉంటే, మనస్సు సాత్వికముగా ఉంటుంది.  రాజసాహారము ఇస్తే, మనస్సు రాజసమవుతుంది. తామసాహారము ఇస్తే మనస్సు తామసమవుతుంది.

ఇక్కడ కాస్త ఆగి భగవద్గీతలో మన స్వామి ఇంకా ఏమి సాధనా క్రమము ఇచ్చాడో చూద్దాము. ఆరో అధ్యాయములో మన స్వామి మనం సాధనకు ఎలా కూర్చోవాలో ఎలా నాసికాగ్రము మీద దృష్టి పెట్టాలో చాలా వివరంగా చెప్పారు. భగవానుడు శ్వాస మీద దృష్టి నిలపని గట్టిగా చెప్పారు

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః|
సమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్|| 6-13 ||

ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును.
శ్వాసనియంత్రిచడము  ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యభాగమని సర్వులు అంగీకరిస్తున్నారు.
 ఈ శ్వాస నియంత్రణ ముఖ్యంగా రెండు రకాలుగా చెయ్యవచ్చును.
మొదటిది : ప్రాణ ప్రత్యవీక్షణ
దీనిలో మన నాసికలలోని  సూర్యనాడి, చంద్రనాడుల ద్వారా ప్రవహించే శ్వాసను చూస్తూ, సహజ కుంభక స్థాయి చేరటము ద్వారా తురీయ దశను పొందటము అనే యోగ ప్రక్రియ. ఇది సద్గురువుల ద్వారా అభ్యసించ వలసినది.
రెండవది ప్రజ్ఞా ప్రత్యవీక్షణ
ఈ యోగ ప్రక్రియలో చరాచర జగత్తు స్వామి ప్రజ్ఞయో అని తలంచి ఆ ప్రజ్ఞను వీక్షించడమే. అంటే దృక్కులు అలా ఒక్కచోటే నిలిపి ఉంచి అలా చూస్తూ ఉండడమే. అలా దృష్టి నిలిపి వున్నా సహజ కుంభకము సాధించవచ్చని జ్ఞానులు నిశ్చయముగా చెపుతున్నారు. ఇది మరొక  యోగప్రక్రియ .
అలా విశ్వమంతా వ్యాపించివున్న శ్రీ తత్వము ప్రతిమనిషిలోను అంతర్లీనమై ఉన్నది.
ప్రతి మనిషి లలాటం లో శ్రీ తత్వాన్ని చూడ వచ్చు అని శ్రీ గబ్బిట వారు తమ బ్లాగులో ఇలా అన్నారు. ‘’లోకానతేత్య లాలతే ,లలితా తేన సోచ్యతే ‘’అంటే అమ్మ వారికి లలిత అన్న పేరు ఆమె లోకానికి అతీత యై లోక లీలను లాలిస్తుంది .కనుక ప్రతి వ్యక్తీ లలాటం అ లీల దామమే .కావలసింది దాని పై ధ్యాస  మననం అవగాహనా మాత్రమె .దీనికే ఈ లలితా  సహస్ర నామాలు సాధనాలు అవుతాయి .అది పఠిస్తుంటే శ్రీ తత్త్వం బోధ పడుతుంది .ఉపాసకులు శ్రీ చక్ర పూజ చేస్తారు .ఇదొక విశిష్టమైన యంత్రం .ఇందులో బిందు ,త్రికోణ ,వలయ రేఖ ,దళాల వంటి చిహ్నాలుంటాయి ఇవి ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి స్టితి లయాలకు ప్రతీకలు .ఈ లక్షణాలన్ని మానవ శరీరం లోనే ఉన్నాయని మనం మర్చి పోతూంటాము .శరీరమే శ్రీ చక్రానికి ప్రతి రూపం అని తెలియాలి .ఇందులోని తొమ్మిది ఆవరణలే మన నవ రంధ్రాలు .అందులోని ఆనంద మయ బిందువే లలాటం మీద ఉన్న సహస్రార చక్రం .ఇదే అమ్మ వారి పవిత్ర నివాసం .శ్రీ చక్రం మన పుట్టుక తోనే వచ్చే పరమాత్మ సాధనం .

శ్రీ విద్య శ్రీ మాతను ప్రసన్నం చేయటానికి దోహద పడుతుంది .లలితా సహస్రనామ పఠనం ఈ మంత్రం ఫలాన్నిస్తుంది .దేవి కృప అంతర్ముఖమైన వారికే లభిస్తుందని మరువ రాదు .అంటే భావన చాలా ముఖ్యం అందుకే ‘’అంతర్ముఖ సమారాధ్యా –బహిర్ముఖ సుదుర్లభా ‘’అన్నారు భవానీ భావనా గమ్యా అనటం భావనే ముఖ్యమని .భావన అంతర్ముఖం అయితే పిండాండం లో బ్రహ్మాండ దర్శనం లభిస్తుంది .ఇదే శ్రీ దేవి ఆరాధనా పరమ లక్ష్యం .దీని శ్రీ సహస్రిక అమోఘమైన సాధనం
శక్తి దేశాకాల ను బట్టి వివిధ రూపాలు ధరిస్తుంది ‘’యస్య యస్య పదార్ధస్య యాయా శక్తి రుదాహృతా –సాసా సర్వేశ్వరీ దేవీ శక్తిమంతో మహేశ్వరః "

ఇంతవరకు చెప్పేటందుకే సద్గురువుల అనుగ్రహము ఉన్నది. ఇఖ ముందు అంతా గురువుల ముఖత: విని అభ్యసించవలసినది. చాలామంది శ్రీ విద్య,
 గురువుల ఉపదేశములేకుండా, గురువులు  సమక్షములో లేకుండా ఉపాసిస్తూ అనేక ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఆదిశంకరుల హెచ్చరికను పెడచెవిని పెట్టి అనేక మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.












04 November, 2019




                    కార్తీక శుక్ల షష్ఠి నా 72 వ జన్మదినం జరుపుకున్నాను.


               ఆనాటి నా ఫేస్బుక్ పోస్టుకు విశేషమైన స్పందన వచ్చింది.



                           ఆ రోజు నా పోస్టు


                "    జాజిశర్మా ! నీకు 72 ఏళ్ళు అంటే నమ్మరేమోరా !  


పూర్వాషాడ నక్షతం, కార్తీక శుక్ల షష్ఠి, శనివారం కలిసి వచ్చే రోజు ఈ రోజు భవదీయుని 72వ పుట్టిన రోజు

ఈ సందర్భముగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల సేవ భాగ్యము మెండుగా పొంది నా విద్యుక్త ధర్మము నెరవేర్చిన సంతృప్తితో వారిని మనసారా ప్రతిరోజు తలచుకుంటూ ప్రణమిల్లుతున్నాను. పితృదేవతలకు విద్యుక్త ధర్మము శక్తిమేరకు చేయటమే పుత్రుని ధర్మం కదా !

విద్యగరపిన గురువులకు మనస్సులో పాదాభివందనములతో కృతజ్ఞతలు చెప్పుకోవటం తప్ప వారి ఋణము ఏ శిష్యుడు తీర్చుకోలేడు కదా !

నాతో కలిసి పెరిగిన ఐదుగురు సోదరులకు, ఐదుగురు అక్కచెల్లెళ్ళ ప్రేమను అమితంగా పొందిన నేను అదృష్టవంతుడననే భావిస్తున్నాను. వారితో మెలిగిన జ్ఞాపకాలే నాకు మిగిలిన మధురానుభూతులు.

ఇఖ స్నేహితులకు కొదవలేదు. అంటే నాతో చదువుకున్న వారు , ఉద్యోగములో భుజాలపై చేతులు వేసుకుని " ఏరా "అని అప్యాయంగా పిలిచే వారున్నారు. వారిని వీలున్నప్పుడెల్లా కలుస్తునే ఉన్నాను.

ఇఖ తల్లిదండ్రులు, దైవం ఇచ్చిన ఈ దేహం ఇప్పటి వరకు ఆరోగ్యం గానే ఉన్నది.

ఫేస్బుక్ మిత్రులు ఇచ్చిన ప్రొత్సాహం, వారి ఆదరణ, కొందరి విపరీతమైన అనురాగం, నా ఆరోగ్య రహస్యం. అందరికీ అనేకానేక నమస్కారములతో, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

ఈ సంతోష సమయాన్ని మీతో పంచుకోవటానికి కావలసిన పోషణాభారం, నైతిక బలాన్ని ఇచ్చిన నా ధర్మపత్నికి జేజేలు. ఆశీస్సులు. నా కొండంత బలం నా కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు అని వేరే చెప్పనఖర్లేదు కదా ! వాళ్ళ అభివృద్ధి కోసమే కదా నిత్య ఆరాధనలు.( కొంత మనకోసం అనుకోండి. )

పెద్దలు ఆశీస్సులు, పిన్నల శుభాకాంక్షలు కోరుకుంటున్న, మీ జాజిశర్మ" 


       కార్తీక శుక్ల షష్ఠి నా 72 వ జన్మదినం జరుపుకున్నాను.



            ఆ పై పోస్టుకు నా మిత్రుల స్పందన పై లింకులో  చూడవచ్చును 


               
                         

12 October, 2019





   చిరంజీవి సునీల్, చిరంజీవి స్వప్న సుందరి 16వ వివాహ వార్షికోత్సవపు

    పోస్టుకు నా మిత్రుల స్పందన.


           చిరంజీవి సునీల్, చిరంజీవి స్వప్న సుందరి 16వ వివాహ వార్షికోత్సవపు పోస్టుకు నా మిత్రుల స్పందన.


          

11 March, 2019

చి.భరద్వాజ కుమారు ,చి.నాగశ్రీవల్లి ల 19 వ వివాహ వార్షికోత్సవము




                   చి.భరద్వాజ కుమారు ,చి.నాగశ్రీవల్లి ల 19 వ వివాహ వార్షికోత్సవము 




                        8వ మార్చి నాడు చిరంజీవుల 19 వ వివాహ వార్షికోత్సవము నాడు పెట్టిన ఫేస్బుక్కు పోస్టు కు వచ్చిన మిత్రుల స్పందన



                           

25 January, 2019

గో హత్య నేరం - రాజీవ్ దీక్షిత్ గెలిచిన కేసు - నా అనువాదం.



గోహత్య నేరం
గోహత్య నేరం
గోవును కాపాడటం ప్రతి గవర్నర్, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ కర్తవ్యం -సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు చెప్పింది
మరి మన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు?
** గో హత్య గురించి సుప్రీం కోర్టు లో జరిగిన వాద ప్రతివాదనలు.. దయచేసి ప్రతి ఒక్కరు చదవండి..
ఇతరులకు తెలియజేయండి**
మాంసాహార విక్రేతలు చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులను ఈ కేసులో పెట్టుకున్నారు. వారిలో కొంతమంది న్యాయవాదులు 35 లక్షల ఫీజు తీసుకునేవారున్నారు. మాంసాహారుల తరఫున కేసును వాదించిన వారిలో శ్రీ సోలి సోరాబ్జీ, ఫీజు ఇరవై లక్షలు, శ్రీ కపిల్ సిబాల్ ఇరవై రెండు లక్షలు, శ్రీ మహేష్ జీత్మలానీ 32 - 35 లక్షల దాకా తీసుకునే అగ్రగాములున్నారు. వీరంతా మాంసాహారుల తరఫున కేసును వాదించారు.
ఇఖ మన శ్రీ రాజీవ్ భాయికు న్యాయవాదిని పెట్టుకునడానికి తగినంత డబ్బు లేదు. హేమాహేమీలు మాంసాహారుల తరఫున వాదిస్తున్నారు. తన తరఫున వాదించటానికి అంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత " కోర్టు మీకు న్యాయ సహాయం ఇస్తే ?" అని అడిగినప్పుడు " అది ఆనందమే కానీ, మా కేసు మేము వాదించుకొనడానికి అనుమతించాలని" శ్రీ రాజీవ్ భాయి కోరారు. అలా అనుమతిస్తునే, కోర్టు శ్రీ M E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించింది. ఇఖ కేసు కొనసాగింది.
ఈ మాంసాహార విక్రేతల వాదనలు శరద్ పవార్, నెహ్రు మొదలైనవారి వాదనల కన్నా భిన్నంగా ఏమీ లేవు. అవి ఆ మెకాలే చదువుల ప్రభావంతో మన విద్యారంగాన్ని కలుషితం చేసిన పదాల గారడీ వాదనలే. వాట్సప్ లో జాజిశర్మకు వచ్చిన ఆంగ్ల పాఠానికి జాజిశర్మ చేసిన స్వేచ్ఛానువాదం చదవండి.
వారి వ్యర్ధవాదనలేమిటో చూద్దాం.
మొదటి వ్యర్ధవాదన: గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.
రెండవ వ్యర్ధవాదన: గోవులకు, ఇతర జంతువులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేదు. అవి ఆకలితో చచ్చేకన్నా వాటిని చంపటం మంచిది.
మూడవ వ్యర్ధవాదన: మనదేశంలో మనుష్యులకే చోటు లేదు. పశువులను ఎలా పోషిస్తాం.
నాలుగవ వ్యర్ధవాదన: మనకు అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతల వలన వస్తుంది.
ఐదవ వ్యర్ధవాదన: మాంసాహారం తినడం మతపరమైన హక్కు .
ఈ వ్యర్ధవాదనలు చేసిన వారిలో ముస్లీం మతము లోని "ఖురేషీ" అనే వర్గము వారు ఎక్కువ హింసకు పాల్పడేవారే. వారే ఈ వ్యర్ధ వాదనలు చేసిన ప్రప్రధములు.
ఈ వ్యర్ధ వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనముతో , నిగ్రహముతో అన్ని వివరాలతో గణాంకములతో సహా కోర్టు వారి ముందుంచారు.
ఆ వ్యర్ధవాదనలకు శ్రీ రాజీవ భాయి సమాధానాలు ఏమిటో ఒకటి తరువాత ఒకటి చూద్దాం ( చదువుదాం ) పదండి.
గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.
ఈ వ్యర్ధవాదనను శ్రీ రాజీవ్ భాయి గణాంకాలతో కోర్టువారికి ఇలా వివరించారు.
ఒక గోవును చంపితే ఎంత మాంసం వస్తుంది, ఎంత రక్తం, ఎన్ని ఎముకలు అనే గణాంకాలతో ఈ వివరణ సాగింది.
ఒక ఆరోగ్యం గా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇఖ 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి 1,200/- . ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-
ఈ వ్యర్ధ వాదనను శ్రీ రాజీవ్ భాయి తన గణాంకాలతో శక్తివంతంగా ఎలా తిప్పికొట్టారో చదవండి. ఆ గణాంకాలు ఇలా ఉన్నాయి.
ఒక ఆరోగ్యమైన గోమాత రోజుకి పదికిలోల గోమయం, ( ఆవుపేడ ), మూడు లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో గోమయం తో 33 కిలోల ఎరువు తయారు అవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు " ఇది ఎలా సాధ్యం " అని అడిగారు. ఆయన తన వాదనను నిరూపించటానికి కొంత సమయం కావాలన్నారు.
దానికి ధర్మాసనం ఒప్పుకున్న తరువాత శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ ఎరువును తయారు చేసి కోర్టువారికి చూపించి, I R C శాస్త్రవేత్తలను పిలిపించి తను గోమయంతో తయారుచేసిన సేంద్రీయ ఎరువును పరీక్షింపచేశాడు. కోర్టువారి ఆధ్వర్యంలో ఆ శాస్త్రవేత్తలు సేంద్రీయ ఎరువును పరీక్షచేసి ఈ సేంద్రీయ ఎరువు అత్యుత్తమ ఎరువుగా నిర్ధారించారు. ఈ సేంద్రీయ ఎరువు భూమికి కావలసిన 18 సూక్ష్మపోషకాలు అన్నీ చ్ ఆ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన , మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కొబాల్ట్, సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం మూడు ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా పదిరెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను ఒప్పుకున్నది.
ఈ వ్యాసంలో గోవధ అనే పదం అనేకమార్లు తప్పనిసరిగా వాడాల్సినందుకు బాధపడుతున్నాను. గోమాత నన్ను, చదివిన మిమ్ములను క్షమించుగాకా ! --జాజిశర్మ
శ్రీ రాజీవ్ భాయి తన వాదనను కొనసాగిస్తూ, కోర్టుకి అభ్యంతరం లేకపోతే, తను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోమయము నుండి, 33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ, తన ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా తమ కృషిని చూడమని అహ్వానించారు.
తన వాదనలో శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో ఆరు రూపాయలు (ఇది అతి తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయము తెచ్చి పెడుతుంది. ( ౩౩ కిలోల ఆవు పేడ నుండి 330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా ! 330 X Rs.6/- ). పైగా ఈ గోమయం వేసే మాతలకు ఆదివారాలు కానీ, శెలవులు కానీ లేవు కదా ! ఈ లెక్కన గోమాత వలన ఒక సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/- ఇదంతా గోమయము వలన అంటే "ఆవు పేడ" వలన వచ్చే ఆదాయం.
రమారమి 20 సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయాన్ని, శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు చూసి అందరూ అవాక్కయ్యారు. ఒక గోమాత తన జీవిత కాలంలో వచ్చే ఆదాయము దాదాపు Rs.1,31,40,000/- ( అక్షరాల ఒక కోటి ముప్పై ఒక్క లక్షల నలభై వేలు ) చ్ దాటిపోవడం చూచి ఆశ్చర్యచకితులయ్యారు.
వేల సంవత్సరాల పూర్వం మన పురాణాలలో గోమయంలో "లక్ష్మి" నివసిస్తుంది అని పూర్వీకులు ఎందుకు ప్రవచించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా నిరూపించారు.
ఇది మన పురాణగంధ్రాలను హేళన చేసిన వారికి చెంపపెట్టు. "మెకాలే" చదువులు వంటబట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన పురాణాలు "గోమయం లో "లక్ష్మి" నివాసముంటుంది అంటే , వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారు అని నవ్విన వారి మొహాలు "తెల్లబోయి" నొళ్ళు వెళ్ళబెట్టారు.
ఇఖ "గోమూత్రము" మీద శ్రీ రాజీవ్ భాయి తన వాదన అద్భుతమైన రీతిలో కొనసాగించారు.
" ఒక గోవు రోజుకి 2 లేక 2.25 లీటర్ల దాకా మూత్రము విసర్జిస్తుంది. ఈ గోమూత్రం అనేక రకాల వ్యాధులకు , మధుమేహానికి, మధుమేహము, క్షయ, కీళ్ళ వాతము, కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగుకు సంబంధించిన వ్యాధులు మొదలైన 48 రకాలైన రోగాలన్నీ సమూలంగా నిర్ములించ గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపుతున్నాయి. ( చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా చెప్పాడు. )
గణాంకలు సమర్పిస్తూ, శ్రీ రాజీవ్ భాయి ఇలా చెప్పారు. ఒక లీటరు గోమూత్రం భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉన్నది. అమెరికాలో గోమూత్రం "పేటెంటు" కూడా చెయ్యబడింది. గోమూత్రానికి మూడు పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి మందులు తయారు చేసుకుంటున్నది.
అమెరికాకు ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం ( వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/- నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/- , వార్షిక ఆదాయం
రూ.3000/- X 365 = రూ.10,95,000/- , ఒక గోవు తన జీవిత కాలమైన 20 సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 ( అక్షరాల రెండు కోట్ల పంతొమ్మది లక్షల రూపాయలు ) .గోమూత్రము వలన కోట్ల ఆదాయం.
ఇదే గోమయం " మిథైన్ " అనే వాయువు ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో పచానానికి వాడుకోవచ్చును.మన ద్విచక్ర వాహానాలను నడుపుకోవచ్చును. మన కార్లు కూడా ఈ వాయువును ఉపయోగించి నడుపుకోవచ్చును.
ఈ వాదన ధర్మాసనం లోని ఒక న్యాయధీశుడు నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి " మీరు అనుమతిస్తే, మీ కారుకు మితైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీరే పరీక్షించండి. మీ కారు మీరే డ్రైవ్ చెయ్యండి. " అని తన వాదన పటిమ చూపించారు. ఆ న్యాయాధీశుడు అనుమతించి, తన కారును మూడు నెలలు మిథైన్ వాయువు తో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు యాబై, నుండి అరవై పైసల కంటే ఎక్కువ ఖర్చు కాకుండా చూచి ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు ఆయన కిలోమీటరు డీజల్ కు నాలుగు రూపాయలు ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు. శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.
ఆ న్యాయధీశుడు సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని ఒప్పుకున్నాడు.
శ్రీ రాజీవ్ భాయి గణాంకాలు అక్కడితో ఆగలేదు. రోజు వచ్చే పది కిలోల గోమయం తో ఎంత మిథైన్ వాయువు తయారు అవుతుందో , అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొడుపు చేస్తుందో చెప్పి ధర్మాసనమునకు తన గణాంకాలు సమర్పించాడు. దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన దాదాపు ఒక లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమవుతే, అరబ్ దేశాల నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనఖర్లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనఖర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది తల్లి గోమాత వలన సాధ్యం. ఆ మాత "శ్రీలక్ష్మి "యే !!
ఈ వాదన విని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయి, ఉప్పెనలా శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనను "సత్యము" అని అంగీకరించి, " గోమాతను సంరక్షించడమే " దేశానికి ఆర్ధికంగా మంచిదని, గోమాత వలననే భారత దేశానికి ఆర్ధికపుష్టి లభించగలదని అంగీకరించారు.
సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, మాంసాహారుల తల బొప్పికట్టి, దిక్కు తోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోంది అని గ్రహించారు. ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్లాది రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు.
అప్పుడు మాంసాహారులు తమ తురుపు ముక్క వేశారు. అది " గో మాసం తినడం వారి ఇస్లాం మతపరమైన హక్కు " అనే వాదన లేవదీశారు. శ్రీ రాజీవ్ భాయి "అయితే, ఎంత మంది ఇస్లాం పాలకులు ఈ మతపరమైన హక్కును వాడుకున్నారు? ఈ మతపరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ" అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలి అని కోరారు.
అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు. " ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు గో మాంసము తినడం మీద ఏమి చెప్పాయో ? ఆ హక్కు అనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని " ఈ కమిటీ ని ఆదేశించారు.
ఈ కమిటీ చారిత్రాత్మక పత్రాలను శోధించి, తేల్చి చెప్పినది.
" ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రధముడు "బాబర్ " ఆయన తన "బాబర్ నామా" లో గోవధ నేరమని, ఆలాంటి నేరం తను చనిపోయినా ఈ దేశంలో జరగకూడదు అని వ్రాసి, తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్ అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్ కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించాడు.
ఇక్కడ దక్షిణాపధం లో టిప్పు సుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసే వాడు కనపడితే "వాడి తలకాయ నరకమన్నాడు". చాలా మంది ఈ శిక్ష లో బలయ్యారు. టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి , గోవధ కు పాల్పడిన వారి" చేతులు నరకమన్నాడు".
.
సుప్రీకోర్టు నియమించిన కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ రాజీవ్ భాయి, వాదన కు మరింత పుష్టి వచ్చింది.
" గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు" అని సూటిగా ప్రశ్నించారు.
తరువాత శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీకోర్టు అనుమతితో పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా గోవధ ను సమర్ధించలేదు. సరికదా , హదీద్ లు , " గోవును రక్షించ మని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి " అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అమాయక ప్రాణి అని , పత్రివారు దాని పట్ల దయ గలిగి ఉండాలి అని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనములో " గోవును వధించిన వాడికి నరకం లో కూడా స్థానం లేదు " అని చెప్పారు.
తన వాదనను ముగిస్తూ, శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు , గోవధ ను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాంమత హక్కు ఎలా అవుతుంది. ఈ మాంసాహారులను, మక్కా, మదీనా లలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు తెలియదు." అని ముగించారు.
మాంసాహారులు మాన్పడిపోయారు. సుప్రీకోర్టు మాంసాహారులను , పదే పదే అడిగింది. వారు ఇస్లాం లో గోవధ చెయ్యమని చూపెట్టలేక పోయారు.
సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం ఈ అత్యంత కీలకమైన కేసులో 26 అక్టోబర్ 2005 న తన తీర్పును ప్రకటించింది,
ఈ తీర్పును మీరు సుప్రీకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును.
.
తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది తన తీర్పులో ఇలా పేర్కొంది.
" గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము, గోవును రక్షించడం రాజ్యాంగ ధర్మముగా భావించాలి. మనం మన రాజ్యాంగములో , " రాజ్యాంగ ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ, ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగము వ్రాసుకున్నాము. ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది. "
సుప్రీంకోర్టు తన తీర్పులో " 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ గో సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి" అని స్పష్టంగా పేర్కొన్నది.
చివరగా శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా మిగిలిపోతాం. శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోమాసం పోతతో తయారు చేసిన తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు ఆఫీసర్ ను కాల్చి చంపాడు. అదే మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసిన ఘటన, గో సంరక్షణతో మొదలయ్యింది.
గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం . అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరము కాదు.
వందే గోమాతరం. శ్రీ రాజీవ్ దిక్షిత్ భాయి ! తమకు భారత జాతి యావత్తూ ఋణపడింది.
ఇది ఓపికగా చదివిన మీకు ధన్యవాదములు. స్వస్తి !!

16 January, 2019





                  మనుమలతో Uri సినిమాకు పూనాలో 14 జనవరి 2019 నాడు వెళ్ళాము



                     అప్పుడు చి.మహాన్యాస భరద్వాజ తీసిన ఫోటో ఫేస్బుక్లో పెట్టినప్పుడు


                     వచ్చిన స్పందన


                                https://www.facebook.com/photo.php?fbid=1854844191311803&set=a.334305780032326&type=3&theater&notif_t=feedback_reaction_generic&notif_id=1547443020153294


                   

08 November, 2018

నా 71వ జన్మదినం నాడు మిత్రుల పోస్టులు




                             శ్రీ వింజమూరి వేంకట అప్పారావు గారి పోస్టు


                                 అందులో శ్రీ పొన్నాడ విజయ వేంకటకృష్ణ సుబ్బారావు గారి

                                   ఆటవెలది పద్యం ఇక్కడ

                                   
                                 జాజి శర్మ పేరు , జడుపు గిడుపు లేదు !
                                 వేద విధులవన్న , వెర్రి ప్రేమ !
                                 సోదరత్వ భావ సుగుణాలు చర్చించు !
                                 జాలి హృదయ మేను , జనుల మనిషి !

(' ఆటవెలది ' : శ్రీ ' జాజి శర్మ ' గారి పుట్టిన రోజు సందర్భం లో Vijayavenkatakrishna Subbarao Ponnada గారి 
ఈ పద్య కానుక !.) -


                       
                                     శ్రీ వింజమూరి వేంకట అప్పారావు గారి పోస్టు


                                       




                                

నా 71వ జన్మదినం నాడు మిత్రుల పోస్టులు




                       శ్రీమాన్ మల్లి సిరిపురం వారి పోస్టు


                         వారి కంద పద్యం

                   
                        గురుతుల్యులగు జగదీశ్వరి జాజిశర్మ కీసర గార్కి జన్మదిన శుభాకాంక్షలతో... 

                                   కందం//

                      నగధరుఁడై నిలుచుండిన l
                      జగదీశ్వరి జాజిశర్మ*జన్మదినంబున్ l
                      ఖగపతి నినుజిష్ణుండని l
                     తగురీతిగ బొగుడుచుండె*దయగను శర్మా ll



                                   Malli Siripuram

నా 71 వ జన్మదినం నాడు మిత్రుల పోస్టులు





                          శ్రీ సాగురు నారాయణ స్వామి గారి పోస్టు


                    శ్రీ సాగురు నారాయణ స్వామి వారి పోస్టు

నా 71 వ జన్మదినం




                 నా 71 వ జన్మదిన 6.11.2018 నాడు పూనాలో మా జ్యేష్ఠ కుమారుని ఇంట్లో జరుపుకున్నాను.


         ఆ నాడు పెస్బుక్లో పెట్టిన పోస్టు కు నా మిత్రులు అశేషంగా అభినందనలు / అశీస్సులు అందించారు.


                     ఆ స్పందనలు ఇక్కడ చూడవచ్చు

                   నా 71 వ జన్మదినం





                   

కీసర వంశము***** KEESARAVAMSAM