కీసర వంశము విశేష అంతర్జాలమునకు మీకు స్వాగతము. WELCOME TO WEB SITE OF KEESARAVAMSAM
14 August, 2013
చి.మహాన్యాస్ ఉపనయనము
చి.మహాన్యాస్ ఉపనయనము
చి.భరద్వాజ కుమార్, చి.ల.సౌ.నాగశ్రీవల్లిల ప్రధమ కుమారుడు
చి.మహన్యాస భరద్వాజ ఉపనయనము శ్రీవిజయనామ సంవత్సర వైశాఖ బహుళ షష్టి గురువారము అనగా ది.30.5.2013 వ తేది ఉదయము 8.37 నిమిషములకు శ్రవణ నక్షత్రయుక్త మిధునలగ్నము పుష్కరాంశము నందు భాగ్యనగరములోని కృష్ణకుంజ్ గార్డన్ లో అతి వైభవముగా జరిగినది.
సుముహుర్తమునకు బంధుమిత్రులు విశేషముగా ఏకత్రితమయి వటువు చి.మహాన్యాస భరద్వాజ కు జ్ఞానభిక్షతో ఆశీర్వదించి`కీసర వంశస్థులను ఆనందపరచినారు.
ఆ వైభవోపేతమైన చాయచిత్రములు ఈ లంకెలో చూడగలరు.
https://picasaweb.google.com/105802903792469439891/MAHANYASUPANAYANAM30THMAY2013#
20 June, 2013
చి. నాగశ్రీవల్లి జన్మదినము
ఈ రోజు మా ప్రధమ పుత్రవధు (కోడలు) చి. నాగశ్రీవల్లి జన్మదినము. కంప్యూటర్ సైన్సు లో మాస్టర్సు చేసిన ఈమె పూనా లో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో టీమ్ లీడర్ గా ఉద్యోగము చేస్తున్నది. కీసర వంశ పెద్దలందరూ ఈమెకు దీవెనలు అందచేస్తున్నారు. దీర్ఘసుమంగళీ భవ ! ఆయురారోగ్య ప్రాప్తిరస్తూ !!
పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ!! అష్టైశ్వర్యాభివృద్ధిరస్తూ !!
05 June, 2013
28 May, 2013
08 May, 2013
06 May, 2013
చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు
చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు ది. 05. 05. 2011 న ఇంద్రప్రస్త లో అతి వైభవముగా జరిగినది.
చిరంజీవిని తాత గారు సాయి , నాయనమ్మ జగదీశ్వరి ఉదయమే హారతి ఇచ్చి దీవెనలు పలికారు. తల్లి
తండ్రులు చి. సునీల్ కుమార్ చి.స్వప్న సుందరి ఆశ్శీ సులు ఇచ్చి మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు ధరింపచేశారు. చిరంజీవి సౌందర్య లహరి పెద్దలందరికీ పాదాభివందనము చెసింది చిరంజీవి స్వర్ణ మంజరి ఈ వేడుకలలో ఉత్సాహముగా పాల్గొంది. వివిధ ప్రాంతముల నుండి బంధుమిత్రులు చిరంజీవి సౌందర్య లహరికి ఫోన్లలో ఆశ్శీశులు అందచేశారు. సాయంకాలము యాభై మంది పిల్లల మద్య సౌందర్య లహరి పుట్టిన రోజు " కేకు" కట్ చేసి స్నేహితులతో నృత్యగాన విభావరిలో పాల్గొని కన్నుల విందు ఛేసినది.
04 May, 2013
26 April, 2013
20 April, 2013
17 April, 2013
03 April, 2013
శ్రీ నాన్నగారి ఆబ్దీకము
శ్రీ నాన్నగారి ఆబ్దీకము ది20-3-2013 ఫాల్గుణ శుద్ధ నవమి బుధవారమునాడు గుంటూరులో ని మారుతీనగర్ చి.పార్ధసారధి స్వగృహం లో శ్రీ ఆదిరాజు పూర్ణచంద్రరావు బావ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది .చి. మూర్తి , చి.రాంబాబు మరదలు శశికుమారి తన కోడలు మనమరాలు ని తీసుకొని వచ్చారు . చి.బిందుకొడుకు సాయి కూడా వచ్చాడు. చి.భాస్కర్ నందిగామనుంది బావగారిని ప్రత్యేకముగా కారు లో తీసుకువచ్చాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ రామచంద్రరావు దంపతులు ఆ కారులోనే వచ్చారు . ఆబ్దీకము తర్వాత రామచంద్రరరావు దంపతులను చి.పార్ధసారధి మనమరాళ్ళు చి. అఖిల చి. నిఖిలలు పూలదండలతో సత్కరించారు . తరవాత చి.పార్ధసారధి, భార్య చి.. ఉమాదేవి కలిసి శ్రీ రామచంద్రరావు దంపతులని నూతన వస్త్రాలతో సత్కరించారు . ఆనాటి సభలో చి. మూర్తి శ్రీ బావగారు , చి. రాంబాబు ముఖ్య అతిధి శ్రీ రామచాద్రరావు లు శ్రీ నాన్నగారి గురించి చక్కగా మాట్లాడారు . అందరు శ్రీ రామచంద్రరావు సేవలు ప్రస్తుతించి, అతను మనలో యొక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయడని అతనిని ఈ సందర్భముగా శ్రీ నాన్నగారి తరఫున సత్కరించడం చాల మంచి విషయమని దానికి శ్రీ రామచంద్రరావు అర్హుడని అందరు తమ ఉపన్యాసములలో చెప్పారు .
చి.పార్ధసారధి కుమార్తె చి. సుశీల స్వప్న అల్లుడు మనమరాళ్ళు ఈ కార్యక్రమ నిర్వహణ భాద్యత చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చాయాచిత్రములు ఇక్కడ చూడండి.
చి.పార్ధసారధి కుమార్తె చి. సుశీల స్వప్న అల్లుడు మనమరాళ్ళు ఈ కార్యక్రమ నిర్వహణ భాద్యత చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చాయాచిత్రములు ఇక్కడ చూడండి.
Subscribe to:
Posts (Atom)














