29 September, 2012

చిరంజీవి స్వర్ణమంజరి స్కూల్లో వేసిన "పిల్లి" వేషానికి సెకండ్ ప్రైజ్ వచ్చిందో హో


చిరంజీవి స్వర్ణమంజరి స్కూల్లో వేసిన "పిల్లి" వేషానికి సెకండ్ ప్రైజ్ వచ్చిందో హో


                       

చిరంజీవి స్వర్ణ మంజరి ప్లే స్కూల్ లో "పిల్లి" వేషము


  చిరంజీవి స్వర్ణమంజరి నిన్న అంటే ది.28.08.2012 న తన  స్కూల్ "రివేరా ప్లే" స్కూల్ లో పిల్లి వేషం

        వేసింది. తను పిల్లి మేకప్ చేసుకుని వెడుతుండగా తీసిన చాయాచిత్రము మీకోసం.


                            

04 September, 2012

నూతన శిశోదయం

నూతన శిశోదయం




చి!ధశరధ రామ నరసింహ శర్మ (రాంబాబు జగ్గయ్యపేట) కుమారుడు, చి!నరసింహారావు, చి!జ్యోతిర్మయిలకు, హైదరాబాదులో ఆగష్టు 20న మద్యాహ్నం 3.30 ని!!లకు కుమార్తె జన్మించినదని తెలుపుటకు సంతోషిస్తున్నాము. తల్లి, శిశువు కులాసా వున్నారు. కీసర వంశస్థులందరు నూతన తల్లిదండ్రులను అభినందిస్తూ, శిశువుకు, వారిరువురకు ఆశ్శీసులందచేస్తున్నాము.

28 August, 2012

చిరంజీవి భరద్వాజ్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

పూనాలో ఈ రోజు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న చిరంజీవి భరద్వాజ్ కుమార్ కు


                       కీసర వంశస్థులందరి తరఫున "పుట్టిన రోజు శుభాకాంక్షలు" తెలుపుతున్నాము.


26 August, 2012

నీల్ ఆమ్ స్ట్రాంగ్ - మా నాయనమ్మ

నీల్ ఆమ్ స్ట్రాంగ్ - మా నాయనమ్మ



నీల్ ఆమ్ స్ట్రాంగ్ - చందమామ మీద కాలు పెట్టిన మొదటి మానవుడు చనిపోయాడని తెలిసి బాధపడని మానవుడుండడు. 1969 జులై 20న అందరిలాగే నందిగామలో రాత్రి దాదాపు భారతీయ కాలమానము ప్రకారం అర్ధరాత్రి వాయిస్ ఆఫ్ అమెరికా నుండి వ్యాఖ్యానము వింటూ ఏదో తెలియని ఆనందములో తేలిపోయాను. ఆ వార్త, ఆ ఆనందము పంచుకోవటానికి ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. మా నాయనమ్మ గదిలోనుండి ఏదో శబ్ధము అయితే గదిలోకి తొంగి చూశాను. ఆవిడ మంచినీళ్ళకోసం లేచింది. ఆవిడ నీళ్ళు తాగేంతవరకు ఆగి, "నాయనమ్మా! మనిషి చందమామ మీద అడుగుపెట్టాడు" అని ఆవిడకు ఆ వార్త అందించి ఆవిడ కాళ్ళకు నమస్కరించాను. ఆవిడకు వయస్సు 82 ఏళ్ళు. వార్త ప్రాముఖ్యము ఆవిడకు అర్ధమయ్యిందో లేదో నాకు తెలియలేదుకాని, " మీ తాతయ్య గారు ఉంటే బాగుండేదిరా" అంటూ కళ్ళు వత్తుకుంది.

24 August, 2012

శ్రీ హనుమంతుని వేదాంతం కధ


శ్రీ హనుమంతుని వేదాంతం కధ

ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .

”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు .

22 August, 2012

కీసరవంశము మొదటి ముగ్గురన్నదమ్ములు


వేంకటరామ నరసింహా రావు -- మద్యలోనున్నవారు
జ్వాలానరసింహాశర్మ ------- కుడివైపునున్నవారు
యోగానంద నరసింహశర్మ ---- ఎడమవైపునున్నవారు

         

18 July, 2012

మా మాతృమూర్తి, కీసర వంశము పెద్దకోడలు కీ.శే. సరస్వతి ప్రసునాంబ గారి 88వ జన్మదినం

మా మాతృమూర్తి, కీసర వంశము పెద్దకోడలు కీ.శే. సరస్వతి ప్రసునాంబ గారి 88వ జన్మదిన సందర్భమున వారి దివ్యసృతికి కీసరవంశము ఘనంగా నివాళులర్పిస్తోంది.







                                                                                          

15 July, 2012

మా చతుర్ధామ యాత్ర

మా చతుర్ధామ యాత్ర


మా చతుర్ధామ యాత్ర చూడటానికి ఈ క్రింద నున్న లింకు నొక్కండి.


http://jajisarma.blogspot.in/

20 June, 2012

చి.నాగశ్రీవల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పూనాలో పుట్టిన రోజు జరుపుకుంటున్న మాపెద్ద కోడలు చి.నాగశ్రీవల్లిని, దీవిస్తూ,


               

                                                                         ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష


                                                                         శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి



చి.ఉమాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కీసరవారి నాలుగవకోడలు చి.పార్ధసారధి ధర్మపత్ని,


                                                             చి.ఉమాదేవిని

Bouquet : colorful bouquet of flowers isolated on white background






                                                " ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష

                                                  శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి"

                                                               అని దీవిస్తున్నాము.



19 June, 2012

చి.చైతన్య "స్టార్ ఫర్ ఫార్మర్" (STAR PERFORMER) 2011-12





                                                                                                                   

            


           చి.చైతన్య "స్టార్ ఫర్ ఫార్మర్" (STAR PERFORMER) 2011-12




                 చి. చైతన్య తను పనిచేసే కొయ్ సెరా కంపెనీలో 2011-12 సంవత్సరమునకు

                                                 "స్టార్ ఫర్ ఫార్మర్" గా

                                                      నిలిచాడు.

       ఈ ప్రతిభావంతమైన పనిపాటవమునకు "కొయ్ సెరా" కంపెనీవారు చి.చైతన్యను జూన్ 13, 2012 న

       సింగపూర్ లో జరిగిన సమావేశములో సన్మానించారు.

కీసరవంశస్థులందరు మనవంశము పేరు-ప్రతిష్టలు ఖండాతరములలో వ్యాప్తి చేస్తున్న చి.చైతన్యను అభినందిస్తున్నాము. కంపెనీ వారిచ్చిన సర్టిఫికెట్ ఇక్కడ పొందుపరచడమైనది.




                                                                                                                


                                                                                                         

10 June, 2012

గీతశ్లోకము పఠిస్తున్న చి.హర్షితకు ఆశ్శీసులతో కూడిన జేజేలు.

చి.చైతన్య,చి.సౌమ్యల ముద్దుపెద్దపాప చి.హర్షిత వేసవి సెలవలు వృధాకానివ్వకుండా ఓ వేసవి విడిదిలో పాల్గొని తన భావాలకు మెరుగు దిద్దుకుంది. ఈ చిరంజీవి ఆ విడిది ముంగింపునందు గీతశ్లోకము పఠిస్తున్న చాయచిత్రమిది. చి.హర్షితకు ఆశ్శీసులతో కూడిన జేజేలు.

                                                                

02 June, 2012

కీసర వంశము - KEESARA VAMSAM: దండం దశ గుణం భవేత్

కీసర వంశము - KEESARA VAMSAM:SPECIAL POSTS

దండం దశ గుణం భవేత్

దండం దశ గుణం భవేత్ అనే మాట తరుచుగా వింటూ ఉంటాం కదా?
దాని పూర్తి పాఠం చూదాం ...

విశ్వా మిత్రా హి పశుషు, కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

వి = పక్షులు
శ్వా = కుక్కలు
అమిత్ర = శత్రువులు
అహి = పాములు
పశు = పశువులు ( వీటిని అదుపు చేయడానికిన్నీ)

కర్దమేషు = బురదలో
జలేషుచ = నీటిలో
అంధే = గుడ్డితనంలో
తమసి = చీకటిలో
వార్ధక్యే = ముసలితనంలో ( సాయంగా ఉండేది కర్ర.)
( ఈ విధంగా)

దండం = కర్ర
దశగుణమ్ = పది విధాలయిన
గుణమ్ = గుణములు కలది
భవేత్ = అగుచున్నది.

అంటే, చేతి కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడుతుంది.

అంతే కాక, బురదలో సజావుగా నడవడానికి, నీటిలో లోతు చూసుకుంటూ దిగడానికీ, చీకటిలో తడుముకుంటూ క్షేమంగా వెళ్ళడానికీ, గుడ్డితనంలో ఆసరాగానూ, ముసలితనంలో ఊతగానూ ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేతి కర్ర పదిరకాలుగా మనకు ఉపయోగ పడుతున్నదన్నమాట.

శ్లోకం అర్ధం ఇలా ఉంటే, మనలో చాలమంది ఎందుకో, దండించడం వల్ల ( శిక్షించడం వల్ల) పదిలాభాలు ఉన్నాయి .. వంటి అర్ధాలు చెబుతూ ఉంటారు. దండం అనే పదాన్ని దండన అనుకోవడం వలన ఈ భావం కలుగుతూ ఉండొచ్చును.

28 May, 2012

ఈరోజు రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న చి!! యశస్విని స్వర్ణమంజరి కి సాయితాతయ్య, జగదీశ్వరి నానమ్మ, భరద్వాజ్ కుమార్ పెద్దనాన్న, నాగశ్రీవల్లి ఆమ్మ (దొడ్డమ్మ), మహాన్యాస్ అన్నయ్య, సహిష్ణు అన్నయ్య,అత్యంత ప్రేమతో శుభాశ్శీసులు అందిస్తూ,
   

                                       "ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష

                                        సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి"

                                      అని ఆశీర్వదిస్తూ, ముద్దులు అందిస్తున్నాము.




















26 May, 2012

చి!సౌందర్యలహరి, చి!స్వర్ణమంజరిల పుట్టినరోజు మహోత్సవాహ్వానము

                         చి!సౌందర్యలహరి, చి!స్వర్ణమంజరిల పుట్టినరోజు మహోత్సవాహ్వానము

24 May, 2012

దైవము - లీలలు

మనము చేసే పాపపుణ్యాలను బట్టీ దైవము


ఫలితాలనిస్తుంది అని మన సనాతన ధర్మం బోధిస్తోంది. వివరంగా చెప్పాలంటే,

మనం చేసే పాపపుణ్యాలు మూడు విభాగాలుగా ఉంటాయి.

ఒకటి. అతిసామాన్య పుణ్యము అతిసామాన్య పాపము. .

రెండు. సామాన్య పుణ్యము. సామాన్య పాపము.

మూడు. అనన్య సామాన్య పుణ్యము. అతి ఘోర పాపము.



దైవము అతిసామాన్య పుణ్యములను, అతిసామాన్య పాపములను, కలలో అనుభవించేవిధముగా చేస్తుంది.

ఉదాహరణకు మనం బిక్షాటనకు వచ్చేవానికి దానం చేయలనుకుని జేబులో చెయ్యిపెట్టుకుంటే,

మనం అనుకున్న పైకం, జేబులో సమయానికి లేకపోతుంది. మనం మనస్సులో నొచ్చుకుంటాము.

ఈలోపల మన ఎక్కవలసిన బస్సు వచ్చేస్తుంది. మనం దానం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాము.దానం చేయాలనే భావన రావడం కూడా ఒకరకమైన పుణ్యమే. కాని దానం చేయలేదు కాబట్టి ఇది అతిసామాన్య పుణ్యఖాతాలోనికి వెళుతుందన్నమాట.

ఇలాంటిఅతిసామాన్య పుణ్యాలను మనము కలలో " ఏదో పదోన్నతి పొందినట్లో" అనుభవింపచేస్తుంది. అలాగే అతిసామాన్య పాపములు.



ఇఖ అనన్య సామాన్య పుణ్యములను, అతి ఘోరపాపములను ఈ జన్మలోనే అనుభవించేటట్లు చేస్తుంది.

మనం ఎదో పెద్దయాగము చేశామనుకోండి, దైవము ఆ ఫలితము ఈజన్మలోనే అనుభవింపచేస్తుంది. అలాగే అతి ఘోరపాపములు చేసేవారు కూడా ఈ జన్మలోనే దాని ఫలితము అనుభవించేటట్లు చేస్తుంది. సంఘములో అవినీతికి పాల్పడినవారిని ప్రభుత్వము, శాసనము శిక్షించడము ఈ కోవలోనికే వస్తుంది.

ఇఖ సామాన్య పుణ్యపాపములను దైవము ముందు జన్మలలో అనుభవింపచేస్తుంది.

ఈ సామాన్య పుణ్యఫలితము దైవం ప్రకృతి భీభస్తమములలో మీ పుణ్యఫలితమును ఉపయోగించి సృష్టిని కాపాడి మీ పుణ్యమును అనేక రెట్లు పెంచి మీకు కావలసిన సమయములో ఆ పుణ్య ఫలితమును అందిస్తుంది.



అదేవిధముగ మనము చేసే పాపములను అనుభవించటానికి వలసిన ఓర్పును నేర్పును మనకు కాలక్రమేణా అందేటట్లు చేస్తుంది.

కాబట్టి దైవలీలలను మనము ఓర్పుతో అర్ధము చేసుకుని, సహనము వహించి, దైవభక్తితో ఉండటము అలవాటు చేసుకోవాలి. దైవమును దూషించరాదు.

శ్రీరామాయణములో రాముని పట్టాభిషేకము రేపు అనగా, రాత్రికి రాత్రి ఘట్టములు సంభవించి శ్రీరాముడు అడవులకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తే, లక్ష్మణస్వామి చలించిపోయి "అన్నయ్యా! నాకు అనుమతినిస్తే తండ్రిని ఎదిరించి, నీకు పట్టాభిషేకము చేస్తా! ఏమిటి! దైవము, దైవము అంటావు?" అని దైవదూషణకు దిగుతాడు. అప్పుడు శ్రీరాముడు ఎంతో ఓర్పుతో "లక్ష్మణా! దైవము నీకు కనబడితేకదా? నువ్వు దైవాన్ని ఎమైనా చేశేది?" అని వారించి లక్ష్మణస్వామిని దైవదూషణా పాపాన్నించి తప్పించి అడవులకు పయనమవుతాడు.

ఇక్కడ గమనించాల్సింది," కనపడని దైవాన్ని నిందించి ప్రయోజనము లేదు,దైవశాసనాన్ని పాలించడమే మానవకర్తవ్యం" అనే శ్రీరామవాక్యాన్ని.

కాబట్టి మనమందరం సదా మన మనస్సనే రాగి చెంబును మలినం కాకుండా భక్తి అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోముతూ, నిరంతరము దైవచింతనతో ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, జీవితంలో కలిగే ఆటుపోటులకు కృంగిపోకుండా సాగిపోయేటట్లు,

చేసుకోవాలి. దానికి పూర్తిశరణాగతి ఒక్కటే మార్గము. భగవంతుని పాదములు మనస్సులో తలచుకుని, ఆయన పాదములు

పట్టుకుని, " నేను నీశరణాగతుడను, నీపాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. జన్మజన్మలలో నేను చేసిన పాపములు మన్నించి, నన్నురక్షించు, తండ్రీ," అను ఆర్తితో ప్రార్ధించండి. ఆ ప్రార్ధనకు భగవంతుడు కరిగిపోయి, మీకు వెంటనే కావలిసినవన్నీ సమకూరుస్తాడు.



స్వస్తి.












15 May, 2012

శ్రీవేదాద్రి అన్నయ్య శ్రీమతి కాత్యాయని వదిన 42వ వివాహ వార్షికోత్సవము

శ్రీవేదాద్రి అన్నయ్య శ్రీమతి కాత్యాయని వదిన 42వ వివాహ వార్షికోత్సవము సందర్భమున వారిద్దరి పాదములకు


నమస్కరిస్తూ కీసర వంశస్థులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము.










వారి అన్యోన్య దాంపత్యము కలకాలము వర్ధిల్లాలని ఏడుకొండల శ్రీవేంకటేశ్వరుని ప్రార్ధిస్తూన్నాము.



08 May, 2012

చి! సునీల్ కుమార్ పుట్టిన రోజు

ఈరోజు అనగా ది.8.05.2012 ఢిల్లీలో నా ద్వితీయ కుమారుడు చి! సునీల్ కుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
                                        


కీసర వంశజుల తరఫున చి! సునీల్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందచేస్తున్నాము.
 
                         http://telugugreetings.net/cgi-bin/pd/pd.cgi?object=/pd/postcards/birthday/large/abhinandanalu.swf&form=form-flash.txt
 
 
 

కీసర వంశము***** KEESARAVAMSAM