10 October, 2013


ఈ రోజు (10.10.2013) చి.సునీల్ కుమార్, చి.స్వప్నసుందరి ల పదవ వివాహ వార్షికోత్సవము.


చిరంజీవి సునీల్ కుమార్ కుటుంబ సభ్యులతో "దుబాయ్" విహారయాత్ర జయప్రదముగా ముగించుకుని డిల్లీ నిన్న ది.9.10.2013 రాత్రి క్షేమముగా తిరిగి వచ్చారు.

తమ పదవ వివాహ వార్షికోత్సవము భాగ్యనగరములో జరుపుకునటకు ఉదయమే బయలుదేరి వెళ్ళారు.

కీసరవంశస్థులందరూ ఈ జంటను చిరాయులువుగాను, ఆయురారోగ్య ఐశ్వార్యాభివృద్ధిగాను, వంశాభివృద్ధిగాను దీవిస్తూ, శుభాకాంక్షలు అందిస్తున్నారు.

06 October, 2013

దసరా సెలవలు దుబాయ్ లో గడుపుతున్న చిరంజీవి సునీల్ కుటుంబము

చిరంజీవి సునీల్ , చి స్వప్న సుందరీ లు, తమ కుమార్తెలు చి.సౌందర్యలహరి, చి.స్వర్ణమంజరీలతో, దసరా శెలవులు దుబాయ్ లొ గడపటానికి గత శుక్రవారము బయలుదేరి వెళ్ళారు.


వారి యాత్ర శుభప్రదము కావాలని కీసర వంశస్థులందరూ తమ శుభాకాంక్షలు అందచేస్తున్నారు.

కీసర వంశజులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

కీసర వంశజులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

చి.ప్రశాంత్, చి.ల.సౌ జ్యోతి లకు శిశోదయం

 లండన్ లో ఉన్న   చిరంజీవి ప్రశాంత్, చి.ల.సౌ.జ్యోతి లకు ఆడ శిశువు జన్మించినదని తెలుపుటకు చాల ఆనందపడుతున్నాము.

ఆ శిశువు విదేశాలలో జన్మించినది కావున, భారత దేశమునకు రావటానికి "వీసా" తదితరముల కొరకు అక్కడే నామకరణం చేయవలసివచ్చినది.

ఆ శిశువు కు 'కార్తీక అమృత వర్షిణి' అని నామకరణం జరిగినది.

  చిరంజీవి కార్తీక అమృత వర్షిణి కి , తల్లిదండ్రులకు కీసర వంశస్థుల శుభాస్సీసులు.

ఇప్పుడే అందిన చి.అమృతవర్షిణి దృశ్యము  ఇక్కడ పొందుపరుస్తున్నాము

కీసర వంశము***** KEESARAVAMSAM