10 October, 2013


ఈ రోజు (10.10.2013) చి.సునీల్ కుమార్, చి.స్వప్నసుందరి ల పదవ వివాహ వార్షికోత్సవము.


చిరంజీవి సునీల్ కుమార్ కుటుంబ సభ్యులతో "దుబాయ్" విహారయాత్ర జయప్రదముగా ముగించుకుని డిల్లీ నిన్న ది.9.10.2013 రాత్రి క్షేమముగా తిరిగి వచ్చారు.

తమ పదవ వివాహ వార్షికోత్సవము భాగ్యనగరములో జరుపుకునటకు ఉదయమే బయలుదేరి వెళ్ళారు.

కీసరవంశస్థులందరూ ఈ జంటను చిరాయులువుగాను, ఆయురారోగ్య ఐశ్వార్యాభివృద్ధిగాను, వంశాభివృద్ధిగాను దీవిస్తూ, శుభాకాంక్షలు అందిస్తున్నారు.

06 October, 2013

దసరా సెలవలు దుబాయ్ లో గడుపుతున్న చిరంజీవి సునీల్ కుటుంబము

చిరంజీవి సునీల్ , చి స్వప్న సుందరీ లు, తమ కుమార్తెలు చి.సౌందర్యలహరి, చి.స్వర్ణమంజరీలతో, దసరా శెలవులు దుబాయ్ లొ గడపటానికి గత శుక్రవారము బయలుదేరి వెళ్ళారు.


వారి యాత్ర శుభప్రదము కావాలని కీసర వంశస్థులందరూ తమ శుభాకాంక్షలు అందచేస్తున్నారు.

కీసర వంశజులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

కీసర వంశజులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

చి.ప్రశాంత్, చి.ల.సౌ జ్యోతి లకు శిశోదయం

 లండన్ లో ఉన్న   చిరంజీవి ప్రశాంత్, చి.ల.సౌ.జ్యోతి లకు ఆడ శిశువు జన్మించినదని తెలుపుటకు చాల ఆనందపడుతున్నాము.

ఆ శిశువు విదేశాలలో జన్మించినది కావున, భారత దేశమునకు రావటానికి "వీసా" తదితరముల కొరకు అక్కడే నామకరణం చేయవలసివచ్చినది.

ఆ శిశువు కు 'కార్తీక అమృత వర్షిణి' అని నామకరణం జరిగినది.

  చిరంజీవి కార్తీక అమృత వర్షిణి కి , తల్లిదండ్రులకు కీసర వంశస్థుల శుభాస్సీసులు.

ఇప్పుడే అందిన చి.అమృతవర్షిణి దృశ్యము  ఇక్కడ పొందుపరుస్తున్నాము

28 August, 2013

చి.భరద్వాజ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు


ఈ రోజు పూనాలో తన పుట్టినరోజు జరుపుకుంటున్న మా జ్యేష్టకుమారుడు చి.భరద్వాజ్ కుమార్ కు కీసర వంశస్థులందరూ ఆశ్శీసులు / అభినందనలు తెలుపుతున్నారు.
                                                                                                                                  


20 August, 2013

చిరంజీవి ప్రవీణ ప్రధమ పుట్టిన రోజు


    జగ్గయ్యపేట లో తన ప్రధమ పుట్టిన రోజు జరుపుకుంటున్న చిరంజీవి  ప్రవీణ కు కీసర వంశస్థులందరు 

    ఆశ్శీసులు అందచెస్తున్నారు. 

  
 
ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి


 

చి.పార్ధసారధి, ఉమాదేవిల 38వ వివాహ వార్షికోత్సవము.

ఈ రోజు గుంటూరు లో తమ 38వ వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్న చి.పార్ధసారధిశర్మ, ఉమాదేవిలకు కీసర వంశస్థులందరూ ఆశీర్వదిస్తూ/ శుభాకాంక్షలు తెలుపుతూన్నారు.





వారి దాంపత్యము నిత్యనూతనమై శోభిస్తూ సుఖసంతోషాలతో వర్ధిల్లుగాక!

15 August, 2013

చి.ప్రశాంత్ కు పుట్టిన రోజు శుభాశ్శీసులు.


నేడు ది.15.08.2013 న లండనులో తన కూతురు చి.కార్తీక అమృతవర్షిణి, ధర్మపత్ని చి.జ్యోతిలతో, పూజ్యులు అత్తమామల సమక్షంలో తన పుట్టిన రోజు జరుపుకుంటున్న చి.ప్రశాంత్ కు కీసరవంశస్థులందరూ అభినందనలు, ఆశ్శీసులు అందచేస్తున్నారు.  

14 August, 2013


చి.ప్రశాంత్, చి.జ్యోతి లకు శిశోదయం



లండనులో ఉద్యోగము చేస్తున్న దంపతులు చి.ప్రశాంత్, చి.జ్యోతి లకు ది. 3.08.2013 న ఆడ శిశువు ఉదయించినది.

తల్లి, శిశువు కులాసాగా ఉన్నారు.

కీసర వంశస్థులందరూ చి.ప్రశాంత్, చి.జ్యోతి లకు అభినందనలు, చి.కార్తీక అమృత వర్షిణికి ఆశ్శీసులు అందచేస్తున్నారు.

పౌత్రునితో సంధ్యావందనము

READY FOR SANDHYAVANDANAM

అపవిత్ర పవిత్రోవా

ఆచమ్య

తాన ఊర్జే దతానః

ఆపోజన యుదాచనః

ప్రాణా యామ్య


ఓం  భూర్భువ
 ఇది కదా మహద్భాగ్యము !! అంతా భగవంతుని కృప !!!

చి.మహాన్యాస్ ఉపనయనము



చి.మహాన్యాస్ ఉపనయనము



చి.భరద్వాజ కుమార్, చి.ల.సౌ.నాగశ్రీవల్లిల ప్రధమ కుమారుడు

చి.మహన్యాస భరద్వాజ ఉపనయనము శ్రీవిజయనామ సంవత్సర వైశాఖ బహుళ షష్టి గురువారము అనగా ది.30.5.2013 వ తేది ఉదయము 8.37 నిమిషములకు శ్రవణ నక్షత్రయుక్త మిధునలగ్నము పుష్కరాంశము నందు భాగ్యనగరములోని కృష్ణకుంజ్ గార్డన్ లో అతి వైభవముగా జరిగినది.



సుముహుర్తమునకు బంధుమిత్రులు విశేషముగా ఏకత్రితమయి వటువు చి.మహాన్యాస భరద్వాజ కు జ్ఞానభిక్షతో ఆశీర్వదించి`కీసర వంశస్థులను ఆనందపరచినారు.



ఆ వైభవోపేతమైన చాయచిత్రములు ఈ లంకెలో చూడగలరు.


https://picasaweb.google.com/105802903792469439891/MAHANYASUPANAYANAM30THMAY2013#




20 June, 2013

చి ఉమ జన్మదినము




ఈ రోజు  గుంటూరు లో జన్మదినము జరుపుకుంటున్న చి ఉమకు (పార్ధసారధి అర్ధాంగి) కీసర వంశ పెద్దలందరూ తమ తమ శుభాకాంక్షలు తెలియచేస్తూన్నారు. దీర్ఘసుమంగళీ భవ ! ఆయురారోగ్య ప్రాప్తిరస్తూ !!
పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ!! అష్టైశ్వర్యాభివృద్ధిరస్తూ !!

చి. నాగశ్రీవల్లి జన్మదినము





ఈ రోజు మా ప్రధమ పుత్రవధు (కోడలు) చి. నాగశ్రీవల్లి జన్మదినము. కంప్యూటర్ సైన్సు లో మాస్టర్సు చేసిన ఈమె పూనా లో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో టీమ్ లీడర్ గా ఉద్యోగము చేస్తున్నది. కీసర వంశ పెద్దలందరూ ఈమెకు దీవెనలు అందచేస్తున్నారు. దీర్ఘసుమంగళీ భవ ! ఆయురారోగ్య ప్రాప్తిరస్తూ !!
పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ!! అష్టైశ్వర్యాభివృద్ధిరస్తూ !!


                                                                                                  

05 June, 2013

చి . జగదీశ్వరి జన్మ దినము


    ఈ  రోజు  మీ మోడరేటర్  ధర్మపత్ని చి . జగదీశ్వరి జన్మ దినము. 

    ఆమెకు కీసర వంశజుల  ఆశ్సిసులు , శుభాకాంక్షలు .

01 June, 2013

HAPPY BIRTH DAY TO CHY.VAMSIKRISHNA S/O SHRI VEDADRI AND SMT.KATYAYANI


  TO-DAY IS THE BIRTH DAY OF CHY.VAMSI KRISHNA

 KEESARAVAMSTASTULU WISH CHY.VAMSI KRISHNA ,S/O SHRI VEDADRI ANNAIAH

AND SMT.KATYAYINI VADINA A VERY HAPPY BIRTHDAY.


                                    ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష


                                    శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి

28 May, 2013

చి.స్వర్ణమంజరి మూడవ పుట్టినరోజు



చి.సునీల్ కుమార్, చి.స్వప్నసుందరీల ద్వితీయ పుత్రిక చి.స్వర్ణమంజరి మూడవ పుట్టినరోజు హైదరాబాద్ లో జరుపుకుంటున్నది. కీసరవంశస్థులందరూ చి.స్వర్ణమంజరిని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగాను, చిరాయువుగాను, సకలకళాభివృద్ధిగాను ఆశీర్వదిస్తున్నారు.

                                                          

08 May, 2013

చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు

                                       చిరంజీవి సునీల్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు


                                         

ఈరోజు న్యుఢిల్లీ లో పుట్టినరోజు జరుపుకుంటున్న చి.సునీల్ కుమార్ కు కీసర వంశస్థులందరు  శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష


                                                    శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి

                                        

                                           

06 May, 2013

చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు


చిరంజీవి సౌందర్య లహరి పుట్టినరోజు ది. 05. 05. 2011 న  ఇంద్రప్రస్త లో అతి వైభవముగా జరిగినది.

        చిరంజీవిని తాత గారు సాయి , నాయనమ్మ జగదీశ్వరి ఉదయమే హారతి ఇచ్చి దీవెనలు పలికారు. తల్లి
తండ్రులు చి. సునీల్ కుమార్ చి.స్వప్న సుందరి ఆశ్శీ సులు ఇచ్చి మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు   ధరింపచేశారు. చిరంజీవి సౌందర్య లహరి పెద్దలందరికీ పాదాభివందనము చెసింది చిరంజీవి స్వర్ణ మంజరి ఈ వేడుకలలో ఉత్సాహముగా పాల్గొంది. వివిధ ప్రాంతముల నుండి బంధుమిత్రులు చిరంజీవి సౌందర్య లహరికి ఫోన్లలో ఆశ్శీశులు అందచేశారు. సాయంకాలము యాభై మంది పిల్లల మద్య సౌందర్య లహరి పుట్టిన రోజు " కేకు" కట్  చేసి స్నేహితులతో నృత్యగాన విభావరిలో పాల్గొని కన్నుల విందు  ఛేసినది.

                                                          

04 May, 2013

చిరంజీవి స్వప్న సుందరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు


చిరంజీవి స్వప్న సుందరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

   ఈ  రోజు జన్మదినము జరుపుకుంటున్న మా ద్వితీయ స్నుష (కోడలు) కు, కీసర వంశస్తులందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

                         


కీసర వంశము***** KEESARAVAMSAM