30 January, 2012

బావగారూ! పదవీ విరమణ శుభాకాంక్షలు!! అందుకోండి

బావగారూ! పదవీ విరమణ శుభాకాంక్షలు!! అందుకోండి






ఖమ్మంజిల్లా పరిషత్ లో 32 ఏళ్ళు పనిచేసి నేడు పదవీ విరమణ చేస్తున్న

శ్రీ అల్లూరు సీతారామారావు B.A., B.Ed., కు శుభాభివందనములు.

మీరు విరామసమయము మీకు అత్యంత ఇష్టమైన "సంఘసేవ"లో గడుపుతూ

ఇలాగే ఆదర్శవంతమైన జీవితము గడపాలని ఆకాంక్షిస్తూ,



కీసరవంశస్తులు.

CHY.ALLURU SEETHA RAMA RAO RETIRES TO-DAY AFTER A GLORIOUS SERVICE

CHY.ALLURU SEETHA RAMA RAO, THE FIFTH SON-IN-LAW OF LATE SHRI KVR NARASIMHA RAO, RETIRES TO-DAY FROM KHAMMAM ZILLA PARISHAD AS SENIOR GRADE TELUGU PANDIT.

WE WISH HIM A HAPPY RETIRED LIFE.

ALL THE KEESARA VAMSASTULU PRESENT HIM THIS VIDEO AS A SWEET MEMORAY

28 January, 2012

సాధనలో భక్తిశ్రద్ధల ఆవశ్యకత

సాధనలో భక్తిశ్రద్ధల ఆవశ్యకత




ఒక దేవాలయప్రాంగణములో ఓ సన్యాసి భగవత్తత్వముగూర్చి భక్తులనుద్దేశించి ప్రసంగింస్తూంటుంటే ఆ ప్రసంగములను అదే దేవాలయము బయటకూర్చుని భిక్షాటనము చేసే ముదుసలి అత్యంత శ్రద్ధగా వింటూ వుండేది. ఆయన ప్రసంగములు ముగించి వేరే ప్రదేశమునకు బయలుదేరే రోజున ఈముదుసలి ఆయనవద్దకు వెళ్ళి, " ఓ మహనీయా! నాకు వయసు అయిపోతున్నది. మీరు చెప్పే మాటలన్నీ విని నేను ఆ భగవంతుని ప్రార్ధించదలచుకున్నాను. ఆ భగవంతుని ప్రార్ధన చేయటానికి నాకు మంత్రమేదైనా దయచేసి ఇప్పించండి" అని ఆయన పాదాలమీదపడి కన్నీళ్ళు పెట్టుకుంది. సన్యాసి ఆ ముదుసలికి "హే ప్రభూ !తవ పాదయే మమ శిర్ ధారయేత్, ప్రసన్న ప్రసన్న శ్రీఘ్రహ్" అని స్మరిస్తుండమన్నాడు. ఆ ముదుసలి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన చెప్పినదానిని ఎల్లవేళలా స్మరిస్తువున్నది. ఇలా ఓపది ఏళ్ళుగడిచాయి. మళ్ళీ సన్యాసి ఆ దేవాలయమునకు విచ్చేశాడు. ఆయన ఈ ముదుసలిని చూసి గుర్తుపట్టి " ఏం అవ్వా! నేను చెప్పినదానిని స్మరిస్తున్నావా?" అనడిగాడు. అందుకావ్వ తలాడించింది. "ఏది పాఠం వప్పచెప్పు" అన్నాడాయన. ఆ ముదుసలి పదేళ్ళుగా తను స్మరిస్తున్న మంత్రమును ఆ సన్యాసి ముందుంచింది. అందుకాయన "అయ్యో! అవ్వా! తప్పు! తప్పు! నేను చెప్పినదొకటి నువ్వుచేస్తున్నదొకటి. నేను ఆయన పాదలమీద నీశిరస్సుపెట్టమంటే, నువ్వు ఆ భగవంతుని శిరస్సున నీపాదాలు పెట్టావు. నువ్వు చేస్తున్నదంతా వ్యర్ధమయ్యింది" అని ఆగ్రహమువెళ్ళగక్కి, తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇంతకూ జరిగినదేమిటంటే రోజూ స్మరిస్తూంటుంటే "తవ" "మమ" అనే పదాలు అటూఇటూ అయ్యాయి. దాంతో అర్ధము మారిపోయింది.

ఆయన చెప్పినదంతావిని ఆఅవ్వ తనుచేసిన పదేళ్ళశ్రమ వ్యర్ధమయినదని తెలుసుకొని అన్నాహారాలుమాని దు:ఖించసాగింది.

వైకుంఠములో శ్రీస్వామివారు ఈభక్తురాలి ఆర్తికి కరిగిపోయి ఆ సన్యాసి స్వప్నమందు కనిపించి, " ఓయీ! నీవు చెప్పిన మాటలకు

ఆ భక్తురాలు హతాశురాలయినది. నేను భక్తిశ్రద్ధలకు బద్ధుడనుకానీ, మంత్రములకు కాదు కదా! ఆ భక్తురాలు అన్నాహారాలుమానివేయడముతో, నాకు ఎంతమంది ఎన్ని నైవేద్యములు పెట్టినా, ఆకలితీరుటలేదు. ముందు నీవుపోయి

ఆభక్తురాలి అన్నపానీయములు విషయము చూడు" అని పలికాడు. ఆ సన్యాసి ఉలిక్కిపడి ఆ భక్తురాలి వద్దకువెళ్ళి ఆవిడ పాదాలమీదపడి, "తల్లీ నా అజ్ఞానాన్ని మన్నించు ! నీవు చేసే పూజయే ఆ భగవంతునికి ఇష్టమయ్యింది. నీ జన్మ సార్ధకమయ్యింది," అని ఆవిడని శతవిధముల వేడుకొని, ఆ భక్తురాలిని సేదతీర్చి ఈ వుదంతమును తన నాటి ప్రసంగములో ఉదహరించి, ఆభక్తురాలిని కొనియాడి, సాధకులకు భక్తిశ్రద్ధలు ఎంత ముఖ్యమో తెలియచెప్పాడు.

ఈ వృత్తాంతములో భక్తిశ్రద్ధలు ఎంత అవసరమొననికానీ, ఉచ్చారణదోషములు లేకుండా చూచుకొనవలెనని సాధకులు గమనించవలసినది.

18 January, 2012

చిరంజీవి హర్షిత పుట్టినరోజు వేడుకలు

చి!!చైతన్య,చి!!సౌమ్యల ప్రధమచిరంజీవి హర్షిత పుట్టినరోజు వేడుకలు ది.14.01.2012 న హైదరాబాద్ లో మాక్డొనాల్డ్ రెస్టారెంట్  లో ఘనంగా జరిగినవి.  చి!హర్షితకు కీసరవంశస్తులందరి శుభాశ్శీసులు. ఈసందర్భముగా జరిగిన వేడుకలకు పితామహులు, మాతామహులు,ఇతర బంధుమిత్రులు ఉత్సహముగా  పాల్గొని ఆనందించారు. వేడుకలు సంధర్భముగా తీసిన చాయ చిత్రములకు ఈ లంకె నొక్కండి. 

http://wwwkeesaravamsamblogspotcom.shutterfly.com/
 

14 January, 2012

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


య ఏవ యత్నః క్రియతే బాహ్యార్థోపార్జనే జనైః !

స ఏవ యత్నః కర్తవ్యః పూర్వం ప్రజ్ఞావివర్ధనే  !!

(యోగ వాసిష్ఠం-ఉపశమ ప్రకరణమ్)

(భావం : బాహ్య వస్తువులను, విషయములను సంపాదించటంలో ఎంతటి ప్రయత్నం చేస్తూంటామో, అంతటి ప్రయత్నాన్నే ముందుగా మన ప్రజ్ఞను వృద్ధి చేసుకోవటంలో చేయాలి. జఠరాగ్ని సమంగా ప్రజ్వరిల్లుతున్నప్పుడే గదా పంచ భక్ష్య పరమాన్నాలను ఆస్వాదించి, ఆనందించ గలిగేది ! పిల్లలను అత్యున్నత విద్యా శాస్త్రాలలో చేర్పించేముందే, వారిలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని సమాజహిత సత్ప్రయోజనాలకొరకే వినియోగించే సద్బుద్ధిని పాదుకొల్పాలి గదా !)

ఈ మకర సంక్రాంతి  శుభ సందర్భమున,

పైన ఇచ్చినటువంటి ఆణిముత్యాలను వేలకొలది అందంగా అమర్చిన కిరీటమానమైన శ్రీమద్రామాయణ, యోగవాసిష్ఠ గ్రంథద్వయమును మన భారతజాతికి అందించిన ఆదికవి శ్రీవాల్మీకిమహర్షియొక్క దివ్యాశీస్సులు మనందరిపై వర్షించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ,

సాయి సాలగ్రామ నరసింహ శర్మ

11 January, 2012

మనో నిగ్రహం

మనో నిగ్రహం


ప్రశ్న :

ఏ పద్ధతిని - ఏ మార్గాన సాధన చేసినా మనసు ను వశం చేసుకోవాలని చూస్తారు. దాన్ని నిగ్రహించమని చెపుతారు. ఒకవైపున మనసు ఒక తెలియని వ్యక్తిగా - మరొక వైపున తనకు అనేకమైన వ్యవహారిక బాధలు, గొడవలు వుండగా - మనం నిజంగా మనో నిగ్రహం సాధించ గలమా?

సమాధానం:

సముద్రం ఎప్పుడూ చూడని ఒకాయన దాన్ని చూసి తెలుసుకోవడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. ఆ విశాల జల రాశి ముందు నిలిచి అందు స్నానం చేయాలని అనుకొన్నాడు. ఆ తీరాన నిలిచి చలించి, ఘోషిస్తున్నట్టి ఆ తరంగాల్ని చూసి "ఈ అలలన్నీ అణిగినప్పుడు ఇంటి వెనక చెరువు లో స్నానం చేసినట్లు - సముద్రం లో దిగి స్నానం చేస్తాను" అనుకున్నాడు.

సముద్రం నిరంతరం అలసట లేకుండా తరంగాలతో సృస్టి మొదటినుంచి, ప్రళయం వరకు ఆవిధంగా చలిస్తూ వుంటుందనే సంగతి ఇతరులు చెప్పడం వల్లగాని, లేదా - తనకు తానుగా తెలుసుకోవడం వల్ల గాని విషయం గ్రహించ వలసి వుంది.


అతడా విషయం తెలుసుకున్న తర్వాత అతడా సముద్రం లో దిగి స్నానం చేస్తాడు. అతడు చేతులు మెల్ల మెల్ల గా వూపుతూ, గత సూచనల ద్వారా ఆ తరంగాలలో మునుగుతూ తన తలపై నించి తరంగాలను పోనిస్తాడు. అతడు శ్వాసను సహజంగా బంధిస్తాడు. అట్లా చేయడం వలన అతడు నేర్పరి అవుతాడు. చివరకి తన లక్ష్యాన్ని సాధిస్తాడు - ఎటువంటి దుఃఖం బాధ కష్టం కలగకుండా.


సముద్రం చలిస్తూ ఉన్నా అతడు దాని బంధం నుండి విముక్తుడు అవుతాడు. "మనస్సు విషయం లో కూడా అంతే".



భగవాన్ రమణ మహర్షి (100 ప్రశ్నలకు రమణ మహర్షి సమాధానాలు నుంచి)

కీసర వంశము***** KEESARAVAMSAM