29 June, 2011

చిరంజీవి స్వర్ణమంజరి ప్రధమ పుట్టిన రోజు వేడుకలు

చిరంజీవి స్వర్ణమంజరి ప్రధమ పుట్టిన రోజు వేడుకలు




చి!!సునీల్ కుమార్, చి!!స్వప్నసుందరీల ద్వితీయ పుత్రిక చి!!స్వర్ణమంజరి ప్రధమ పుట్టిన రోజు వేడుకలు ది. 28.5.2011 న హైదరాబాద్ లో

నారాయణగూడ లోని తాజ్ మహల్ హోటల్, పవన్ బాంక్వెట్ హాలులో ఘనంగా జరిగినవి.

చి!!సునీల్ కుమార్ విచ్చేసిన పెద్దలకు, పిన్నలకు ఆహ్వనం పలికిన పిమ్మట,వేడుకలకు హాజరయిన పిన్నలు, పెద్దలు

"హ్యపీ బర్త్ డే టూ యూ" అంటూ పాట పాడుతూ వుండగా చిరంజీవి స్వర్ణమంజరి చిరంజీవి సౌందర్యలహరి సహాయంతో పుట్టినరోజు కేకును

కట్ చేసి అమ్మకు నాన్నకు అందించింది.



ఈ వేడుకలకు పితామహులు, మాతామహులు దంపతీసమేతంగా విచ్చేసి చిరంజీవి స్వర్ణమంజరిని ఆశీర్వదించారు.



పవన్ బాంక్వెట్ హాలు శోభాయమానంగా అలంకరించారు. బార్బీ బొమ్మలతో వేదిక పిల్లలకు పెద్దలకు కనువిందు చేసింది.

మూడువందలకు పైగా పూర్ణిమనాటిచంద్రుని పరిమాణంలోవున్న బెలూనులు పిల్లల అల్లరిని అంతులేకుండాచేసింది.



చి!!భరద్వాజ్ కుమార్, చి!!మహాన్యాస్, చి!!సహిష్ణు, పూనా నుండి వచ్చి  చి!!స్వర్ణమంజరిని ఆశీర్వదించి, ఆనందించారు.



ఖమ్మంమెట్టు నుండి చి!!సీతారామారావుగారు చి!!ఝాన్సీలు విచ్చేసి చిరంజీవికి తమ దీవెనలు అందించారు.

వారి మనుమడు చి!!సీతారామారావు ,చి!!ఉమాశంకర్ చి!!మహతీల సుపుత్రుడు వినిపించిన ముద్దుపలుకులు ఆ మనోహరమైన

రాత్రికి మరో ఆకర్షణగా నిలిచింది.

షుమారు ఓ వందమంది బంధుమిత్రులతో పవన్ బాంక్వెట్ హాలు కళకళలాడుతూండగా పిల్లలు వాళ్ళకి వచ్చిన నర్సరీ గీతాలు ఆలపించారు.

చి!!హర్షిత, చి!!సౌందర్యలహరి, చి!!సహిష్ణు వారి వారి బాణీలలో నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు.

చి!!సోహన్ భరద్వాజ్, చి!!సంజయ్ భార్గవ చేసిన మిమిక్రీ అందరి మన్ననలను పొందింది.

చి!!ప్రత్యూష గానం చేసిన గీతం ఆహుతుల మనసులను ఆహ్లదపరచింది.

అటుపిమ్మట, షడ్రచులతో విందుభోజనం ఆరగించి, ఐస్ర్కీమ్ మరియు చల్లని పానీయములు సేవించి బంధుమిత్రులు మరోసారి

చిరంజీవి స్వర్ణమంజరిని దీవించి వెళ్ళారు.



ఈ వేడుకలకు సంబంధించిన చిత్రాలు కొరకు ఇక్కడ "క్లిక్" చేయండి.


https://picasaweb.google.com/106248072635947277206/CHYSWARNAMANJARIFIRSTBIRTHDAYCELEBRATEDATNARAYANAGUDATAJ#

కీసర వంశము***** KEESARAVAMSAM